Rahman Rajamouli: ప్రపంచ సినిమా రంగంలో ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గురించి ప్రస్తావన వస్తే బాలీవుడ్ గురించి మాట్లాడుకునే వాళ్ళు. కానీ “బాహుబలి” రిలీజ్ అయ్యాక ప్రపంచ సినిమా రంగం భారతీయ చలనచిత్రా రంగం గురించి ప్రస్తావన వస్తే రాజమౌళి గురించి మాట్లాడుకునే పరిస్థితి ప్రస్తుతం నేలకొంది. జక్కన్న తీసిన బాహుబలి, “RRR” ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ స్థాయిని అంతర్జాతీయంగా పెంచేశాయి. సో దీంతో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ కి ఇండియాలో ఏ దర్శకుడకు రాని ఆహ్వానాలు రాజమౌళికి వస్తున్నాయి.
అంతేకాదు రాజమౌళి రీసెంట్ మూవీ “RRR” ఆస్కార్ నామినేషన్ కి వెళ్లే పరిస్థితి కూడా ప్రస్తుతం నెలకొంది. ఒక సీరియల్ తీసే దర్శకుడు నుండి కొన్ని వేల కోట్లు కలెక్ట్ చేసే సినిమాలు.. రికార్డులు క్రియేట్ చేసే దర్శకుడిగా రాజమౌళి ప్రయాణం దేశ సినిమా రంగంలో సంచలనంగా మారింది. ఇలాంటి తరుణంలో ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత సంచలనం ఏఆర్ రెహమాన్ … రాజమౌళి పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రీసెంట్ గా ఓ మీడియా సంస్థకి ఏఆర్ రెహమాన్ ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో రాజమౌళి గురించి మాట్లాడుతూ “మగధీర” చూశాక.. కచ్చితంగా రాజమౌళి గొప్పగా ఏదైనా సాధిస్తారని అనుకున్నాను.
ఆ తర్వాత “బాహుబలి” చూసి ఆశ్చర్యపోయా. రాజమౌళి తన సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయిని పెంచుతున్నారని ఏఆర్ రెహమాన్ అన్నారు. ఇదే సమయంలో పాన్ ఇండియా ప్రస్తావన రావటంతో రోజా, బాంబే, దిల్ సే సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలేనని ఈ సంగీత దిగ్గజం చెప్పారు. తాజాగా విడుదలై ఘన విజయం సాధించిన ‘పొన్నియన్ సెల్వన్ 1’ గురించి కూడా రెహమాన్ మాట్లాడారు. ‘పొన్నియన్ సెల్వన్ 1’ విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని స్పష్టం చేశారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!