Acharya: ఆచార్య..మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన మెగా మల్టీస్టారర్. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్, ప్రేక్షకులు గత ఏడాది నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి సారి మెగా తండ్రీ – కొడుకులు స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ సినిమా మీద భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు చేసిన ప్రతీ సినిమాతో వరుస హిట్స్ అందుకున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు – గ్లిమ్స్ – టీజర్ అలాగే, ‘లాహే లాహే’, ‘నీలాంబరి’ ‘సానా కష్టం’ పాటలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇక ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘ఆచార్య’ సినిమాను సమ్మర్ కానుకగా ఈ ఏప్రిల్ 29న విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. అయితే, గత నెలరోజుల నుంచు ఆర్ఆర్ఆర్ సందడి తప్ప ఆచార్య సినిమా నుంచి రెగ్యులర్ అప్డేట్స్ లేకపోవడం తో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అందుకు కారణం తాజాగా వచ్చిన ఉగాది పండగ సందర్భంగా ఏదైనా సర్ప్రైజింగ్ అప్డేట్ మేకర్స్ నుంచి వస్తుందేమో అని అందరూ ఆశించారు. కానీ, ఆ అప్డేట్స్ ఏవీ రాకపోవడంతో బాగా డిసప్పాయింట్ అయ్యారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సొంత నిర్మాణ సంస్థలో మ్యాట్నీ ఎంటర్టైమెంట్స్ నిర్మించిన ఈ సినిమాలో కాజల్, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటించారు.
Acharya: ఉగాది రోజు అప్డేట్ మిస్ అయినా మాస్ ఫీస్ట్ మాత్రం మామూలుగా ఉండదట.
అయితే, ఉగాది రోజు అప్డేట్ మిస్ అయినా మాస్ ఫీస్ట్ మాత్రం మామూలుగా ఉండదట. ఇకపై ఆచార్య సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజింగ్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయని.. ఎటూ ప్రమోషన్స్ మొదలవబోతున్న నేపథ్యంలో అప్డేట్స్ ఎందుకులే అని మేకర్స్ ఉగాది నాడు ఏదీ సినిమా నుంచి రివీల్ చేయలేదని తెలుస్తోంది. ఇక సైరా తర్వాత చిరు, ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తున్న ఆచార్య సినిమా మీద వసూళ్ళ మీద గట్టిగానే మేకర్స్ ఫోకస్ పెట్టారు. ఇక ఆచార్య తెలుగుతో పాటు మిగతా భాషల లోనూ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!