18.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Balakrishna Vs Akkineni: ‘అక్కినేని తొక్కినేని’ కామెంట్ పై ట్విట్టర్ లో రచ్చ రచ్చ..!!

Share

Balakrishna Vs Akkineni: “వీరసింహారెడ్డి” సక్సెస్ ఫుల్ లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెను తుమారాన్ని రేపుతున్నాయి. అక్కినేని అక్కినేని ఇంకా ఆ రంగారావు ఈ రంగారావు… అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతూ ఉన్నాయి. బాలకృష్ణపై అక్కినేని అభిమానులతో పాటు కాపు సంఘానికి చెందిన వాళ్లు మండిపడుతున్నారు. ఈ వివాదంపై ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన నాగచైతన్య అఖిల్ స్పందించడం తెలిసిందే. ‘నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచడం మనల్ని మనమే కించపరుచుకోవడం…’ అంటూ ట్వీట్ చేశారు. ఇంకా ఎస్వీ రంగారావు పై ఇష్టానుసారంగా మాట్లాడటంతో కాపు సంఘానికి చెందిన వాళ్లు బాలకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

balakrishna Akkineni Tokkineni comments controversy reaches a peak
Akkineni Tokkineni

ఎస్వీ రంగారావు కాపు సామాజిక వర్గానికి చెందిన దిగ్గజానటుడు.. కావటంతో కాపు ప్రతినిధులు బాలకృష్ణకి ఇప్పటికే వారిని ఇచ్చి క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే బాలకృష్ణ అల్లుడు లోకేష్ పాదయాత్ర అడ్డుకుంటామని వారిని ఇచ్చారు. ఇంత జరిగినప్పటికీ బాలకృష్ణ నుండి ఇటువంటి స్పందన లేకపోవడంతో అక్కినేని ఫ్యాన్స్ మరికొంతమంది సోషల్ మీడియాలో.. గట్టిగా టార్గెట్ చేశారు. ఈ మేరకు మెంటల్ బాలయ్య అని పేరుతో హ్యాశ్ ట్యాగ్ వైరల్ చేస్తున్నారు. ఈ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. మెంటల్ బాలకృష్ణ, ముద్దుల మామయ్య కాదు మెంటల్ మామయ్య అనే హ్యష్ ట్యాగ్ లతో ట్రెండింగ్ చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో వివిధ సందర్భాలలో అసభ్యకరంగా ఇంకా వివాదాస్పదంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల వీడియోలను అక్కినేని ఫ్యాన్స్ షేర్ చేస్తూ ఉన్నారు. పండు తెలుగు రాష్ట్రాలలో బాలకృష్ణ “వీరసింహారెడ్డి” సక్సెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి.

balakrishna Akkineni Tokkineni comments controversy reaches a peak
Balakrishna

తెలుగు చలనచిత్ర రంగానికి ఎంతో పేరు తీసుకొచ్చిన ఇటువంటి దిగ్గజానటులపై బాలకృష్ణ నోరు పారేసుకోవడం నిజంగా దురదృష్టమని సామాన్యులు సైతం కామెంట్లు చేస్తున్నారు. మరోపక్క బాలయ్య తప్పుడు ఉద్దేశంతో… సరదా కోణంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆయనను మరి కొంతమంది సమర్థిస్తున్నారు. ఏది ఏమైనా అక్కినేని తొక్కినేని అని బాలయ్య చాలా తేలికగా ఎటకారంగా చేసిన వ్యాఖ్యలు మాత్రం… అక్కినేని అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తీసుకొచ్చాయి. బాలకృష్ణ మెంటల్ సర్టిఫికెట్ నీ రెన్యువల్ చేయించండి అని భారీ స్థాయిలో కౌంటర్లు వేస్తున్నారు.


Share

Related posts

బాక్సాఫీస్ వ‌ద్ద `కార్తికేయ 2` సునామీ.. వారం రోజుల్లో వ‌చ్చిందెంతో తెలుసా?

kavya N

క్రాక్ సినిమాకి కోలీవుడ్ మేకర్స్ నుంచి భారీ ఆఫర్ ..?

GRK

చిరంజీవి గోవింద ఆచార్య ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Vihari