NewsOrbit
సినిమా

Bangarraju: 20 రోజుల్లో `బంగార్రాజు` రాబ‌ట్టింది ఇదే.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

Bangarraju: అక్కినేని హీరోలైన కింగ్ నాగార్జున‌, ఆయ‌న త‌న‌యుడు నాగ చైత‌న్య క‌లిసి న‌టించిన తాజా చిత్రం `బంగార్రాజు`. కళ్యాణ్ కృష్ణ కురసాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ‌, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టించారు. 2016లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన `సోగ్గాడే చిన్ని నాయనా`కు సీక్వెల్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యాన‌ర్ల‌పై నాగార్జున స్వ‌యంగా నిర్మించారు.

భారీ అంచ‌నాల న‌డుమ‌ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌లైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఫ‌స్ట్ వీక్‌లో అదిరిపోయే రేంజ్‌లో క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టిన బంగార్రాజు.. సెకెండ్ వీక్ నుంచీ క్ర‌మంగా డ‌ల్ అయిపోయింది. ఇక తాజాగా ఇర‌వై రోజుల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. 20వ రోజు రూ. 10 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బంగార్రాజు 20 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఈ విధంగా ఉన్నాయి..

నైజాం- 8.30 కోట్లు
సీడెడ్- 6.85 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌- 5.21 కోట్లు
తూర్పు గోదావ‌రి- 4.14 కోట్లు
పశ్చిమ గోదావ‌రి- 2.90 కోట్లు
గుంటూరు- 3.44 కోట్లు
కృష్ణ- 2.25 కోట్లు
నెల్లూరు- 1.75 కోట్లు
————————————————————————
ఏపీ+తెలంగాణ‌ మొత్తం- 34.84కోట్లు(56.63కోట్లు~ గ్రాస్‌)
————————————————————————

క‌ర్ణాట‌క‌+రెస్ట్ ఆఫ్ ఇండియా- 1.79 కోట్లు
ఓవ‌ర్సీస్‌ – 1.49 కోట్లు
————————————————————————–
వైర‌ల్డ్ వైట్ టోట‌ల్ క‌లెక్ష‌న్‌- 38.12కోట్లు(64.07కోట్లు~ గ్రాస్‌)
—————————————————————————

కాగా, రూ. 39 కోట్ల టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 38.12 కోట్ల షేర్‌ను రాబ‌ట్టింది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ అవ్వాలంటే ఇంకా రూ. 88 లక్షలను వ‌సూల్ చేయాల్సి ఉంది. మ‌రి బంగార్రాజు ఇంకాస్త జోరు పెంచి బ్యాలెన్స్ అమౌంట్‌ను క‌లెక్ట్ చేస్తుందో..లేదో.. చూడాలి.

 

author avatar
kavya N

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N