25.7 C
Hyderabad
March 30, 2023
NewsOrbit
సినిమా

Bangarraju trailer: `బంగార్రాజు` ట్రైలర్ వ‌చ్చేసింది..తండ్రీకొడుకులు అద‌ర‌గొట్టేశారుగా!

Share

Bangarraju trailer: టాలీవుడ్ కింగ్ నాగార్జున‌, ఆయ‌న త‌న‌యుడు నాగ చైత‌న్య క‌లిసి న‌టించిన తాజా చిత్రం `బంగార్రాజు`. కళ్యాణ్ కృష్ణ కురసాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌, జీ స్టూడియోస్‌ బ్యాన‌ర్ల‌పై నాగార్జున స్వ‌యంగా నిర్మించారు.`సోగ్గాడే చిన్నినాయనా` సినిమాకు సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో నాగ్‌కు జోడీగా ర‌మ్య‌కృష్ణ‌, నాగ‌చైత‌న్య స‌ర‌స‌న అందాల భామ కృతి శెట్టి న‌టించారు.

ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌బోతోంది. ఈ నేప‌థ్యంలోనే జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్న చిత్ర యూనిట్‌.. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. `బంగార్రాజు బావ‌గారు చూపుల‌తో ఊచ‌కోత కోసేస్తారు మీరు` అంటూ స్వ‌ర్గంలో అమ్మాయిలతో సరసాలు ఆడే బంగార్రాజు పాత్రని పరిచయం చేయడంతో ప్రారంభమైన ట్రైల‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది.

బంగార్రాజు బుద్దులతో ఊడి పడిన మనవడు చిన బంగార్రాజుగా నాగచైతన్య, తనకన్నా తెలివైన చదువుకున్న అమ్మాయి లేద‌ని భావించే నాగలక్షిగా కృతి శెట్టిలు కనిపించారు. గ్రామీణ నేపథ్యంలో చైతూ సందడి, కృతి శెట్టి కామెడీ టచ్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌, విజువ‌ల్స్ వంటి అంశాలు అద్భుతంగా ఉన్నాయి.

ఇక హాయిగా జీవితాన్ని గ‌డుపుతున్న చిన్న బంగార్రాజుకు ఏదో స‌మ‌స్య రావ‌డం.. దానిని పరిష్క‌రించేందుకు బంగార్రాజు భూమ్మీదకు వచ్చినట్లు ట్రైలర్ లో చూపించారు. మొత్తానికి తండ్రీకొడుకులిద్ద‌రూ ట్రైల‌ర్‌లో అద‌ర‌గొట్టేసి.. సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేశారు. నాగ్‌, చైతుల‌ యాస, మ్యానరిజం మ‌రింతగా అల‌రించాయి. కాగా, రావు రమేశ్,వెన్నెల కిశోర్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించ‌గా.. యమధర్మరాజుగా నాగబాబు కనిపించ‌నున్నాడు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.


Share

Related posts

Bheemla Naayak: “బీమ్లా నాయక్” ఒక్క తెలుగులోనే అంత కలెక్ట్ చేయబోతోందట..??

sekhar

Anchor Suma: వెండి తెరపై సుమ రెమ్యునరేషన్ అన్ని కోట్లా ..?

Ram

Samantha: తమిళనాడులో ప్రత్యేక పూజలు నిర్వహించిన హీరోయిన్ సమంత..!!

sekhar