సినిమా

Acharya: `భలే భలే బంజారా` వ‌చ్చేసింది.. తండ్రీకొడుకులు టాప్ లేపేశారుగా!

Share

Acharya: మెగాస్టార్ చిరంజీవి హీరోగా స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఆచార్య‌`. ఇందులో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మ‌రో కీల‌క పాత్ర‌ను పోషించ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. అలాగే రియ‌ల్ హీరో సోనూసూద్ ఇందులో విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు.

కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై నిరంజన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచ‌నాలు ఉన్న ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే సినిమాపై అంచ‌నాల‌ను తారా స్థాయికి తీసుకెళ్లేందుకు మేక‌ర్స్ వ‌రుస అప్డేట్స్‌ను వ‌దులుతున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమాలోని `భలే భలే బంజారా` అనే సాంగ్ రిలీజ్ చేశారు. మణిశర్మ స్వ‌రాలు అందిన ఈ పాట‌కు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చారు. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్.. యువ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి ఈ సాంగ్‌ను ఆలపించారు. `హే సింబా రింబా.. చిరుతా పులులా చిందాటా.. సింబా రింబా సరదా పులులా సయ్యాట.. భలే భలే బంజారా, పచ్చ పంటేరా.. రే కచ్చేరిలో రెచ్చిపోదామురా` అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది.

అలాగే ఈ పాట‌ చిరు, చ‌ర‌ణ్‌లు త‌మ‌దైన‌ డ్యాన్స్‌తో మిస్మ‌రైజ్ చేశారు. ఎక్క‌డా డ్రాప్ అవ్వ‌కుండా గ్రేస్‌ఫుల్ ఎన‌ర్జీతో తండ్రీకొడుకులు టాప్ లేపేశారు. దీంతో ఇప్పుడీ సాంగ్ యూట్యూబ్ ట్రెండింగ్‌గా మారింది. కాగా, నక్సల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను ఏ మాత్రం అందుకుంటుందో చూడాలి.


Share

Related posts

దగ్గుబాటి వారింట పెళ్లి బాజా…! ఎప్పుడంటే…?

somaraju sharma

Harish Shankar: ఆ స్టార్ హీరోతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న డైరెక్టర్ హరీష్ శంకర్..??

sekhar

Bandla Ganesh: ఎవరిని నమ్మొద్దని హితబోధ చేస్తున్న బండ్ల గణేష్.. తగలరానిచోట దెబ్బేదైనా తగిలిందా పాపం!

Ram