Bigg Boss Ott Telugu: బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్.. తెలుగులో ఇప్పటికే ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మరి కొద్ది నెలల్లో సీజన్ 6 కూడా ప్రారంభం కానుంది. కానీ, ఈలోపే ప్రేక్షకులను 24/7 ఎంటర్టైన్ చేసేందుకు ఓటీటీ వేదికగా బిగ్‌బాస్‌ను తీసుకువస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 26న బిగ్‌బాస్ ప్రారంభం కాబోతోంది.
ఇందుకు సర్వం సిద్ధం చేసిన మేకర్స్.. ప్రస్తుతం షోపై భారీ హైప్ క్రియేట్ అయ్యేందుకు జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఓటీటీ బిగ్‌బాస్‌కి సైతం కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. అయితే తాజాగా మేరక్స్ ఓ వీడియోను పోస్ట్ చేశాడు.
ఈ వీడియోలో బిగ్‌బాస్ కొత్తింటిని చూపించిన నాగార్జున.. `ఇప్పటి వరకు బిగ్‌బాస్ గంట మాత్రమే చూశారు.. ఇకపై గ్యాప్ లేకుండా చూసేయండి` అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి అదిరిపోయిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా, బిందు మాధవి, కమెడియన్ ధనరాజ్, ఆదర్శ్, ముమైత్ ఖాన్, రోల్ రైడా, తేజస్వి, అషు రెడ్డి, అరియానా గ్లోరి, మహేశ్ విట్టా, సరయు, హమీదా, నటరాజ్ మాస్టర్, యాంకర్ నిఖిల్ , యాంకర్ శివ , చిచ్చా చార్లెస్, అజయ్ కతుర్వార్, యాంకర్ స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతులు ఓటీటీ బిగ్‌బాస్‌లో పాల్గొనబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
A weekend extravaganza is on its way! Keep your phone's fully charged! Keep your popcorn tub filled! #BiggBossNonStop starts TOMORROW only on @DisneyPlusHSTel #BiggBoss #disneyplushotstar @iamnagarjuna @EndemolShineIND pic.twitter.com/G63Jc6cMbm
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) February 25, 2022
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!