Bollywood: బాలీవుడ్లో వివాదాలకు పెట్టింది పేరు కరణ్ జోహర్. దర్శకుడిగా, నిర్మాతగా పలు విజయవంతమైన సినిమాలు తీసిన కరణ్ కు వివాదాలేమి తక్కువ కాదు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే నటి కంగనా రనౌత్ అనేకమార్లు డైరక్ట్ గానే ఇతగాడిపైన విమర్శలు చేసింది. అయితే వేటిపైన కరణ్ స్పందించలేదు. అయితే తాజాగా అక్షర్ కుమార్ వైఫ్, నటి ట్వింకిల్ ఖన్నా కూడా కరణ్ ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకో తెలీదు గాని కరణ్ జోహార్ ని అక్కడినుండి బ్యాన్ చేయాలంటోంది.
వివరాల్లోకి వెళితే.. మే 20న కరణ్ 50 వ పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ పార్టీ చిన్ని సైజు అవార్డు ఫంక్షన్ లా జరిగిందని బాలీవుడ్ మీడియా కోడై కూసిన సంగతి తెలిసిందే. ఇకపోతే బాలీవుడ్ లో ప్రైవేట్ పార్టీలకు కరణ్ జోహార్ పెట్టింది పేరు. బాలీవుడ్ లో పార్టీ అంటే కరణ్ జోహార్ ఇవ్వాలి అనే రేంజ్ లో వాదనలు వినబడతాయి. గతంలో బాలీవుడ్ సెలబ్రిటీలకు కరణ్ ఎన్నో కిరాక్ పార్టీలిచ్చారు. అందులో ఓ పార్టీకి సంబంధించిన వీడియో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి తరువాత వైరల్ గా మారి కరణ్ ని ఇబ్బందులకు గురిచేసిన సంగతి తెలిసిందే.
అసలు విషయంలోకి వెళ్తే, ఈ పార్టీకి భర్తతో పాటు ట్వింకిల్ ఖన్నా హాజరు అయ్యారు. పార్టీ మూడులో భర్త అక్షయ్ కుమార్ తో పాటు అమ్మడు బాగా ఎంజాయ్ చేసారని వినికిడి. దాంతో హ్యాంగోవర్ పీక్స్ కి చేరిందట. రోజులు గడుస్తున్నా ట్వింకిల్ పాపకి ఆ పార్టీనే గుర్తొస్తుందట. అంత హ్యాంగోవర్ కి గురిచేస్తున్న కరణ్ జోహార్ ని నిజంగా బ్యాన్ చేయాలంటూ ట్వింకిల్ ఖన్నా సోషల్ మీడియా వేదికగా ఫన్నీగా కామెంట్ చేయడం కొసమెరుపు. అంతే కాకుండా `బ్యాన్ పార్టీస్ ఫ్రీ డ్రింక్స్ పార్టీస్ ని కరణ్ జోహార్ ని బ్యాన్ చేయాలంటూ పోస్ట్ పెట్టి షాకిచ్చింది.
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…