Brahmanandam: ఒకానొక సమయంలో కమెడియన్ బ్రహ్మానందం లేనిదే సినిమాలు ఉండేవి కావు. ఎప్పటి నుండో బ్రహ్మానందం హవా నడుస్తోంది. అయితే గత కొద్ది నెలల క్రితం ఆయన అనారోగ్యానికి గురికావడం మాత్రమే కాక ముంబైలో ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స చేయించుకుని తిరిగి ఇంటికి చేరుకుని ఇలా చాలా వరకు సినిమాలకు దూరం అవడం జరిగింది. అదే సమయంలో బ్రహ్మానందం సినిమాలకు గుడ్ బై చెప్పేశారు అనే వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. అదే టైములో బ్రహ్మానందం బుల్లి తెరపై కొన్ని సూచనలు కనిపించడంతో ఇక బ్రహ్మీ నీ సిల్వర్ స్క్రీన్ పై చూడలేము అని అందరూ అనుకున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఏకంగా బ్రహ్మానందం మళ్లీ సినిమాల్లో అది కూడా పాన్ ఇండియా మూవీ లో.. హీరో కి తగ్గ రీతిలో ఫుల్ లెంత్ కామెడీ రోల్ ప్లే చేయటానికి రెడీ అయినట్లు లేటెస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. విషయంలోకి వెళితే వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ప్రభాస్ నాగ అశ్విన్ సినిమాలో.. ఫుల్ లెంత్ కామెడీ పాత్ర అది కూడా ప్రభాస్ పక్కనే ఉండే పాత్ర బ్రహ్మానందం కి చాలా డిఫరెంట్ గా నాగ్ అశ్విన్ డిజైన్ చేసినట్లు లేటెస్ట్ టాక్.
Read More: Prabhas: షూటింగ్ లో ఉన్న ప్రభాస్ సినిమా స్క్రిప్టు మొత్తం మార్చేసిన డైరెక్టర్..??
సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బ్రహ్మానందం కామెడీ కూడా చాలా హైలెట్ అన్నట్టు టాక్ నడుస్తోంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు బిగ్ బి అమితాబ్ అదే రీతిలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!