పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన “లైగర్” మరి కొద్ది గంటల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున చేస్తున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కావటంతో నార్త్ ఇండియా మొదలుకొని సౌత్ ఇండియా వరకు సినిమా టీం మొత్తం చుట్టేస్తుంది. ఇలాంటి తరుణంలో అస్సలు “లైగర్” సినిమా ఐడియా ఎలా వచ్చింది అన్న దాన్ని గురించి పూరి జగన్నాథ్ కొత్త విషయాన్ని బయట పెట్టారు. ఇటీవల డైరెక్టర్ సుకుమార్… పూరి జగన్నాథ్ నీ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలియజేశారు.
ఇద్దరమ్మాయిలతో సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో బన్నీ నాతో ఒక డిస్కషన్ చేశారు. ఒక హాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అతని సినిమాలో హీరోకి ఏదో ఒక డిజేబులిటీ పెడతారు. ఏదో అంగవైకల్ ఏమో చెవిటోడు.. గుడ్డోడు ఆ తరహాలో ఆ డైరెక్టర్ సినిమాలో హీరోల క్యారెక్టర్ ఉంటది. మీరు ఆ తరహాలో ఒకటి ప్లాన్ చేయొచ్చు కదా అని బన్నీ అన్నాడు. ఈ క్రమంలో అలా ఆలోచిస్తూ ఉంటే చెబిటోడు మోగాడు అంటే మరీ బాగోదు దీంతో నతోడు..గా ఆలోచన చేస్తూ “లైగర్” స్టోరీ రావడం జరిగింది. అదే సమయంలో ఎప్పటినుండో మార్షల్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లో సినిమా చేయాలని ఆలోచన ఉండేది.. నత్తి ఐడియా ని అలా ఉపయోగించి ఎంఎంయే.. ఇంటర్నేషనల్ బాక్సింగ్ తరహాలో.. సినిమా స్టోరీ ప్లాన్ చేయడం జరిగింది అని పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు.
సుకుమార్ ఇంటర్వ్యూలో ఇంకా అనేక విషయాల గురించి చర్చించడం జరిగింది. సుకుమార్ సినిమా ఫీల్డ్ లోకి వచ్చాక పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడానికి.. ప్రయత్నాలు చేసినట్లు.. కూడా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పూరి డైలాగులు రాయటం ఇంకా సినిమా నెలలోనే కంప్లీట్ చేయటం వంటి విషయాలపై అన్ని అనర్గళంగా ప్రశ్నలు వేస్తూ.. అనేక సమాచారాన్ని పూరి దగ్గర సుకుమార్ రాబట్టుకోవడం జరిగింది. ప్రతి హీరోకి మేనరిజం మీరే క్రియేట్ చేశారు పుష్పాలు కూడా బన్నీకి నేను పెట్టిన మేనరిజం మీరే ఇన్స్పిరేషన్.. అంటూ పూరి పై సుకుమార్ తన అభిమానాన్ని చాటుకున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!