సినిమా

Chiranjeevi: చిరంజీవి ఆ పాట విషయంలో నో అన్నారు..! కానీ.. సూపర్ హిట్టయింది..

chiranjeevi doubted about that song
Share

Chiranjeevi: చిరంజీవి Chiranjeevi తన ప్రతి సినిమాలో ఎలాంటి డ్యాన్సులు చేసి ప్రేక్షకులను ధియేటర్లకు రప్పించారో తెలిసిందే. టాలీవుడ్ లో అలానే చిరంజీవి ప్రభ అప్రతిహతంగా వెలిగిపోయింది. అయితే.. చిరంజీవి డ్యాన్సులపై శ్రద్ధ పెట్టారు కానీ.. ఆయన నర్తించే పాటలకు స్వయంగా పాడుకోవాలని ఎప్పుడూ ఆలోచించలేదు. నిజానికి ఏ హీరో కూడా ఆ ప్రయత్నం చేయానుకోరు. కానీ.. చిరంజీవితో ఆ ప్రయత్నం తొలిసారి చేయించారు దర్శకుడు సురేశ్ కృష్ణ. 1997లో వచ్చిన మాస్టర్ సినిమాలో చిరంజీవి తొలిసారి పాట పాడారు. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆ పాట. అయితే.. దాని వెనుక ఓ కథ ఉందని ఈమధ్య రివీల్ చేశారు సురేశ్ కృష్ణ.

chiranjeevi doubted about that song
chiranjeevi doubted about that song

‘చిరంజీవితో నేను అసిస్టెంట్ డైరక్టర్ గా ఉన్నప్పటి నుంచీ పరిచయం ఉంది. బాలచందర్ దగ్గర అసిస్టెంట్ గా రుద్రవీణ సినిమాకు పని చేశాను. ఆ తర్వాత 9 ఏళ్లకు నా దర్శకత్వంలో చిరంజీవిని డైరక్ట్ చేసే అవకాశం వచ్చింది. సినిమాలో ఫస్టాఫ్ లో చిరంజీవి మాస్టర్ గా పెద్ద తరహాలో స్టూడెంట్స్ మధ్యే ఉంటారు. సెకండాఫ్ వస్తేనే గానీ కథలో చిరంజీవి మాస్ యాక్షన్ ఉండదు. ఈ సమయంలో ఫస్టాఫ్ లో ఫ్యాన్స్ కు కిక్కివ్వాలంటే ఏదైనా ప్రత్యేకత జోడించాలని భావించాను. దీంతో చిరంజీవితో పాట పాడించాలని భావించాను. అదే మాట అల్లు అరవింద్, సంగీత దర్శకుడు దేవాకు చెప్తే ఓకే అన్నారు. కానీ.. చిరంజీవి ససేమిరా అన్నారు. ఎంత చెప్పినా పాడననే అన్నారు.’

Read More: ‘సీఎం కావాలనుంది..’ కోరిక బయటపెట్టిన స్టార్ హీరో..

‘అయితే.. సినిమా కథలోని ఇంటెన్సిటీ, పాట పాడాల్సిన సందర్భాన్ని మళ్లీ వివరించాను. దీంతో కొత్తగా, ప్రత్యేకంగా ఉంటుందని ఆయన కూడా భావించారు. పాట పాడేందుకు అంగీకరించారు. ట్యూన్, సాహిత్యం తీసుకుని చక్కగా పాట పాడేశారు. ఆ పాట అప్పట్లో చాలా స్పెషల్ అయింది. స్టూడెంట్స్ మధ్య డ్యాన్స్ చేయడం.. ఆయనే స్వయంగా పాట పాడటం ఫ్యాన్స్, ఆడియన్స్ కు మంచి థ్రిల్ కలిగించింది’ అని చెప్పుకొచ్చారు సురేశ్ కృష్ణ. మాస్టర్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 53 సెంటర్లలో 100 రోజులు, విజయవాడ రాజ్, కాకినాడ సత్యగౌరి ధియేటర్లలో 175 రోజుల చొప్పున రన్ అయింది.

 


Share

Related posts

Chiranjeevi: ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న మెగాస్టార్ కొత్త సినిమా టైటిల్..!!

sekhar

పవర్ స్టార్ తొలిప్రేమ, ఖుషీ, గబ్బర్ సింగ్ రికార్డ్స్ ని బ్రేక్ చేసేలా వకీల్ సాబ్ ప్లాన్స్ .. అవన్ని ఉన్నాయట ..!

GRK

Trisha Krishnan : అయ్యో ..పాపం త్రిష పరిస్థితి ఏమిటి ఇలా అయ్యింది..?

Teja