Salman Khan: సల్మాన్ ఖాన్ Salman Khan అనే పేరు బాలీవుడ్ లో ఓ సంచలనం. సల్లూ భాయ్ సినిమా వచ్చిందంటే మొదటి రోజు వంద కోట్లు.. సినిమా ఫ్లాప్ అయితే.. మినిమం 100 నుంచి 200 కోట్ల కలెక్షన్. ఇక హిట్ అయితే.. రికార్డులన్నీ బ్రేకే. ఇదీ సల్మాన్ సినిమాకు ఉన్న క్రేజ్. గతేడాది వరకూ సల్మాన్ సినిమా వస్తుందంటే ఇదే.. ఇతర హీరోలు సైతం.. ఆసూయపడేలా.. ఆయన సినిమా కలెక్షన్లు ఉండేవి. కానీ.. ప్రస్తుతం పరిస్థితులు మెల్లగా మారుతున్నాయి. భరత్, దబాంగ్3 సినిమాలు, కలెక్షన్లు సల్మాన్ క్రేజ్ మ్యాచ్ కాలేదు. రీసెంట్ గా రిలీజైన రాధే పరిస్థితి అంతకంటే ఘోరంగా తయారైంది. ఈ సినిమాకు వచ్చిన టాక్ కలెక్షన్లు అంత దారుణంగా ఉన్నాయి.
ప్రస్తుత కరోనా పరిస్థితులను కూడా లెక్క చేయకుండా.. రంజాన్ సెంటిమెంట్ మిస్ కాకూడదని రాధే సినిమాను ధియటరికల్ రిలీజ్, పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేశారు. కానీ.. మొదటి రోజే సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది. రివ్యూలు కూడా అసలేమాత్రం పట్టించుకోలేదు. కరోనా పరిస్థితులు పక్కనపెడితే సినిమాలో అసలు కంటెంట్ ఏమీ లేదన్నది టాక్. దీంతో సినిమా చూసే ఇంట్రస్ట్ ఎవరికీ లేకపోయింది. దీంతో మొదటి రోజే 100 కోట్లు వసూలు చేసిన రికార్డులున్న సల్మాన్ ఖాన్ కు రాధే కేవలం 25 వరకూ మాత్రమే వసూలు చేసిందని తెలుస్తోంది. రిలీజ్ రాంగ్ టైమే అయినా సెంటిమెంట్ కి వెళ్లినందుకు కంటెంట్ ఫెయిల్యూర్ కూడా రాధేకు మైనస్ గా మారింది.
సినిమా విడుదల రోజే జీ5-జీప్లెక్స్ ల్లో సర్వర్ల క్రాష్ కూడా సినిమా ఫలితంపై ప్రతికూల ప్రభావాలు పడ్డాయి. ఓవర్సీస్, మ్యూజికల్ రైట్స్, డిజిటల్ వ్యూస్ ద్వారా కొంత సేఫ్ అయినా నష్టాలు తప్పేట్టు లేదు. మొత్తంగా సల్మాన్ రేంజ్ సినిమా అయితే కాకుండా పోవడం వల్ల ఈ నష్టాలు. సిటీమార్ పాట బాలీవుడ్ వర్గాల్లో హైప్ తీసుకొచ్చినా పెద్దగా ప్రభావం చూపలేదు. ఏదైమైనా.. టికెట్ కొని ధియేటర్లకు వెళ్లడమే కష్టమవుతున్న పరిస్థితుల్లో సినిమాల్లో కంటెంట్ చాలా ముఖ్యం. ఈ పరిస్థితుల్లో సల్మాన్ వంటి హీరో ఉన్నా కంటెంట్ లేకపోతే పరిస్థితి ఏంటో రాధే మరోసారి నిరూపించింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!