GodFather: మెగాస్టార్ చిరంజీవి కొద్ది రోజుల క్రితం తన సోషల్ మీడియా ఎకౌంట్ లో ఒక వాయిస్ క్లిప్ పోస్ట్ చేయడం జరిగింది. ఆ వాయిస్ క్లిప్ లో “రాజకీయాలకు నేను దూరమయ్యాను.. నా నుండి రాజకీయం దూరం కాలేదు అంటూ వాయిస్ ఇచ్చారు. దీంతో రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చిరంజీవి వాయిస్ సంచలనం సృష్టించింది. దీంతో చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రచారం జరిగింది. తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ నుండి ఏపీ సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు కథనాలు ప్రసారమయ్యాయి.
ఇటువంటి తరుణంలో తాజాగా తన పొలిటికల్ డైలాగ్ వాయిస్ క్లిప్పుపై .. చిరంజీవి స్పందించారు. “గాడ్ ఫాదర్” సినిమాకి సంబంధించి ప్రమోషన్ ప్రోగ్రాంలో స్పెషల్ ప్రైవేట్ జెట్ లో యాంకర్ శ్రీముఖికి చిరంజీవి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా శ్రీముఖి ఈ వాయిస్ ఓవర్ క్లిప్పుపై ప్రశ్న వేసింది. దానికి చిరంజీవి సమాధానం ఇస్తూ.. ఇంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అసలు ఊహించలేదు. ఇది కూడా ఓ రకంగా మంచిదేనని తెలిపారు.
ఇంకా సినిమాకి సంబంధించి అనేక విషయాలు ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. మోహన్ రాజా దర్శకత్వంలో.. తెరకెక్కిన “గాడ్ ఫాదర్” అక్టోబర్ 5వ తారీఖు విడుదల కానుంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషించారు. ఇంకా సునీల్, సత్యదేవ్, నయనతార మరి కొంతమంది కీలక నటీనటులు నటించారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నారు. “ఆచార్య” అట్టర్ ఫ్లాప్ కావడంతో… “గాడ్ ఫాదర్” పై అభిమానులు భార్య అంచనాలు పెట్టుకోవడం జరిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక అనంతపురంలో జరగనుంది.