Unstoppable 2: ఆహా ఓటీటిలో “అన్ స్టాపబుల్” మొదటి సీజన్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడం తెలిసిందే. “అన్ స్టాపబుల్ ” షో ఇండియాలో ఓటీటి రంగంలో అనేక రికార్డులు సృష్టించింది. ఫస్ట్ టైం బాలయ్య హోస్ట్ గా అద్భుతంగా షో సక్సెస్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. మొదటి సీజన్ లో ఇండస్ట్రీకి చెందిన చాలామంది బిగ్ సెలబ్రిటీలు రావడం బాలయ్య తనదైన శైలిలో ప్రశ్నలు వేయడంతో పాటు మరోపక్క కామెడీ పండించటం.. చాలావరకు రక్తి కట్టించింది. ముఖ్యంగా మహేష్ బాబు, రవితేజ, పూరి అదే విధంగా విజయ్ దేవరకొండ వచ్చిన ఎపిసోడ్ లు బాగా హైలైట్ అయ్యాయి.
దీంతో ఇప్పుడు “అన్ స్టాపబుల్ 2” మరింత హైలెట్ అయ్యే రీతిలో ఆహా యాజమాన్యం చాలా పెద్ద సెలబ్రిటీలను తీసుకురావడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దసరా నుండి ప్రారంభం కాబోయే “అన్ స్టాపబుల్ 2″లో మొదటిగా చిరంజీవి రానున్నారట. ఆ టైంలోనే “గాడ్ ఫాదర్” రిలీజ్ నేపథ్యంలో ప్రమోషన్ మాదిరిగా ఈ షోలోకి చిరంజీవి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి మొదటి సీజన్ లోనే చిరంజీవి వస్తారని ప్రచారం జరిగింది కానీ చివరిలో క్యాన్సిల్ అయినట్లు టాక్. కానీ అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ చిరంజీవితోనే స్టార్ట్ కానుందట.
గతంలో “పుష్ప” సినిమా ప్రమోషన్ టైంలో ఈ షోలోకి సుకుమార్, అల్లు అర్జున్, రష్మిక మందన వచ్చారు. ఇప్పుడు ఇదే తరహాలో చిరంజీవి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి సంబంధించి హైప్ ఓ రేంజ్ లో ఇవ్వటానికి ఆహా ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు టాక్. పవన్ కళ్యాణ్ తో పాటు త్రివిక్రమ్ కూడా సెకండ్ సీజన్ కి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా వీళ్ళ తర్వాత అనుష్క కూడా “అన్ స్టాపబుల్ 2″లో ఇంటర్వ్యూకి రానున్నట్లు సమాచారం. గతంలో బాలకృష్ణతో ఒక మగాడు సినిమాలో అనుష్క నటించింది. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టితో సినిమా చేస్తోంది. మొత్తం మీద చూసుకుంటే “అన్ స్టాపబుల్ 2” లో మొదటి సీజన్ లో కంటే పెద్ద స్టార్లు తీసుకురావడానికి షో నిర్వహణకు రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.