నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కావటంతో మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో ప్రజెంట్ టెక్నాలజీతో మహేష్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలు పోకిరి, ఒక్కడు సినిమాలు కొన్ని ప్రాంతాలలో విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాలకు సంబంధించి స్పెషల్ షోలకు వచ్చిన డబ్బులను మహేష్ ఫ్యాన్స్ పేదరికంలో ఉన్న పిల్లలకు చదువుకోవడానికి సహాయం చేయడానికి నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ ఐమాక్స్ లో పాటు తెలుగు రాష్ట్రాలలో కొన్ని సెలెక్టివ్ థియేటర్లలో ఆల్ టైం సూపర్ హిట్ సినిమాలైన పోకిరి, ఒక్కడు సినిమాలను ప్రదర్శిస్తున్నారు.
ఎన్ని సంవత్సరాలు గడిచిన పోకిరి క్రేజ్ తగ్గలేదని మరోసారి ఈ స్పెషల్ షో టికెట్లు అమ్మకాలు విషయంలో తేలింది. ఈ రెండు సినిమాల స్పెషల్ షోలా టికెట్ బుకింగ్ హాట్ కేకుల మాదిరిగా అమ్ముడుపోయాయి. ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే బాయ్ మహేష్ కి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎందరో చిన్నారులకు గుండా ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేష్ బాబు. ఆ భగవంతుడు అతనికి మరింత శక్తిని సక్సెస్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్తడే మహేష్ అని ట్వీట్ చేశారు.
దీంతో చిరంజీవి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే పుట్టినరోజు సందర్భంగా తమ అభిమాన హీరో చేయబోయే సినిమాలకు సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమాకి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!