VV Vinayak Dilraju: సినిమా రంగానికి రాజకీయ రంగానికి విడదీయరాని బంధం ఉంది. సినిమా రంగంలో తిరుగులేని క్రేజ్ ఏర్పడితే చాలు సదరు నటీనటుల గురి రాజకీయం వైపే ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే చాలామంది సినీరంగం నుండి రాజకీయ రంగంలో ప్రవేశించడం కొత్త పార్టీ లు పెట్టడం దుకాణాలు సర్దేయడం కూడా జరిగింది. బాలీవుడ్ మొదలుకొని సౌత్ వరకు చాలా మంది నటీనటులు ఈ విధంగానే వ్యవహరిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం రాజకీయం చూస్తే ఎన్నికలను తలపిస్తూ ఉంది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తెలంగాణలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు సంవత్సరాలు ఎన్నికలకు టైం ఉంది. పరిస్థితిలో ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ టాప్ నిర్మాత.. మరియు ఓ టాప్ దర్శకుడు.. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. మేటర్ లోకి వెళ్తే ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే దిల్ రాజు తన సొంత జిల్లా నిజామాబాద్..లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో త్వరలోనే దిల్ రాజు రాజకీయ రంగంలోకి అడుగు పెట్టే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక ఇదే సమయంలో టాప్ దర్శకుడు వి వి వినాయక్ కూడా ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన వి.వి.వినాయక్ కి వైసిపి, టీడీపీ, జనసేన పార్టీలో ఉన్న చాలామంది నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి. అంతా కుదిరితే వివి వినాయక్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!