Prabhas: ఇటీవలె `రాధేశ్యామ్`తో ప్రేక్షకులను పలకరించి భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న నేషనల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓం రౌత్ దర్శకత్వంలో `ఆదిపురుష్` ను కంప్లీట్ చేసిన డార్లింగ్.. ఇప్పుడు ప్రశాంత్ నీల్‌తో `సలార్`, నాగ్ అశ్విన్ డైరెక్షన్లో `ప్రాజెక్ట్ కె` చిత్రాలు చేస్తున్నారు.
ఈ రెండు సినిమాలు సెట్స్ మీదే ఉన్నాయి. ఇవి పూర్తైన వెంటనే సందీప్ రెడ్డి వంగాతో `స్పిరిట్` అనే మూవీ చేయానున్నాడు. అయితే వీటితో పాటు ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ మారుతితో ఓ మూవీ చేసేందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడని జోరుగా వార్తలు వస్తున్నాయి. డివివి ఎంటర్టైన్మెంట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారట.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇందులో ముగ్గురు హీరోయిన్లు అలరించబోతున్నారని.. ఈ మూవీకి `రాజా డీలక్స్` అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని కూడా అంటున్నారు. అయితే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ మారుతి లాంటి చిన్న దర్శకుడితో సినిమా చేయడం అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారగా.. దీని వెనక ఓ సీక్రెట్ ఉందంటూ టాక్ నడుస్తోంది.
అసలింతకీ ప్రభాస్ మారుతి మూవీని ఒప్పుకోవడానికి ప్రధాన కారణం యాక్షన్ సినిమాల నుంచి రిలీఫ్ పొందడానికేనట. మిర్చి సినిమా నుంచి వరుసగా యాక్షన్ ఓరియంటెడ్ సబ్జెక్టులే చేస్తూ వస్తున్నాడు ప్రభాస్. మొన్న వచ్చిన రాధే శ్యామ్ ప్యూర్ లవ్ స్టోరీ అయినా ఫలితం బెడిసి కొట్టింది. అందుకే మాంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలనే ఉద్ధేశంతో ప్రభాస్ మారుతిని ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.