Dhamaka: రవితేజ కొత్త సినిమా ధమాకా సూపర్ డూపర్ హిట్ కావడం జరిగింది. “క్రాక్” సినిమా తర్వాత రవితేజకి మరో హిట్టు పడలేదు. దీంతో కెరియర్ డేంజర్ జోన్ లో ఉన్న సమయంలో త్రినాధరావు డైరెక్షన్ లో రైటర్ ప్రసన్నకుమార్ కథలు మరియు మాటలు అందించిన ధమాకా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో రికార్డు స్థాయి కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి. సినిమాలో హీరోయిన్ శ్రీ లీల నటనకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తానని మాట ఇచ్చారు. అంతేకాదు హీరోయిన్ శ్రీల చాలా టాలెంటెడ్ మరియు అందం తో పాటు పాజిటివ్ నేచర్ కలిగిన వ్యక్తి అంటూ కొనియాడారు. ఇక ఇదే కార్యక్రమానికి వచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్ చాలా ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. హరి శంకర్ ఇండస్ట్రీలో ఈ పొజిషన్ లో రావడానికి కారణం రవిశంకర్ అని రవితేజ అసలు పేరు తెలియజేశారు. ఖతర్నాక్ షూటింగ్ చెన్నైలో జరుగుతున్న సమయంలో నా సినిమాకి ఒక నిర్మాత పక్కకు తప్పుకోవటంతో.. చాలా బాధపడుతున్నాను.
ఈ విషయం తెలుసుకున్న రవితేజ చెన్నై నుండి నాకు ఫోన్ చేసి హరి శంకర్ ఈ రెండో సినిమాకి కూడా నేనే హీరో. నాకు కథ అవసరం లేదు అంటూ నా వెనకాల ఉండి.. మద్దతిచ్చాడు. రవి అన్నని నేను ఎప్పుడు మర్చిపోలేను. ఆరోజు అసలు మర్చిపోలేను. నా జీవితంలో పది సంవత్సరాలు రవితేజ సమక్షంలోనే గడిచిపోయాయి. అనంతరం రవితేజ కాళ్లు హరి శంకర్ మోక్కాడు. రవితేజతో హరీష్ మొదటి సినిమా షాక్. ఆ తర్వాత మిరపకాయ సినిమా చేయడం జరిగింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!