Harish Shankar – Salman: టాలీవుడ్లో ఉన్న స్టార్ డైరెక్టర్స్‌లో హరీశ్ శంకర్ ఒకరు. షాక్ సినిమాతో దర్శకుడిగా మారిన హరీశ్ శంకర్ ఆ తర్వాత మిరపకాయ్, గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాథం, గద్దలకొండ గణేశ్ లాంటి సినిమాలతో స్టార్ డైరెక్టర్‌గా మారారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు భవదీయుడు భగత్‌సింగ్ అనే టైటిల్‌ను కన్ఫర్మ్ చేసి పవన్ కళ్యాణ్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
అయితే, ఇప్పుడు ఇదే సంస్థ బాలీవుడ్ టాప్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నట్టు తాజా వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవలే ముంబైలో దర్శకుడు హరీశ్ శంకర్ సల్మాన్‌ను కలిశారు. ఇద్దరి మధ్యన చర్చలు జరిగాయి. అది ఓ మూవీ ప్రాజెక్ట్ కోసమే అని తాజా సమాచారం. టాలీవుడ్లో శ్రీమంతుడు సినిమాతో అడుగుపెట్టిన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్టార్ హీరోలతో భారీ చిత్రాలను నిర్మిస్తూనే మీడియం బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్నారు.
Harish Shankar – Salman: త్వరలో అఫీషియల్ కన్ఫర్మేషన్..!
ఈ క్రమంలోనే తమిళంతో పాటు హిందీలో కూడా సినిమాలు నిర్మించాలనే ప్లాన్స్ చేస్తున్నట్టు గత ఏడాది మైత్రీ సంస్థ వారు చెప్పారు. ఆ ప్లాన్స్‌లో భాగంగానే ఇప్పుడు సల్మాన్ ఖాన్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో హిందీ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారట. త్వరలో మొదలవబోయో పవన్ కళ్యాణ్ సినిమాను కంప్లీట్ చేసి ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక సల్మాన్ ఇటీవలే మెగాస్టార్ నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా షూట్‌ను ముంబైలో పూర్తి చేశారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!