Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. “చిత్రం”(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోవటం జరిగింది. దీంతో టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే వరుస పెట్టి ప్రేమ కథ నేపథ్యం సినిమాలు చేస్తూ ఉన్న ఉదయ్ కిరణ్ మధ్యలో డౌన్ ఫాల్ రావడం జరిగింది. ఆ తర్వాత పెద్దగా విజయాలు సాధించలేకపోయాడు. దాంతో కృంగిపోయి.. అవకాశాలు లేక ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకోవడం తెలిసిందే. అటువంటి ఉదయ్ కిరణ్ పై సీనియర్ హీరో ఆకాష్(Akash) తాజా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
“ఆనంద్”(Anand), “పిలిస్తే పలుకుతా” వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలలో హీరోగా చేసిన ఆకాష్.. అప్పట్లో మంచి ఫాలోయింగ్ క్రియేట్ చేసుకోవడం తెలిసిందే. అయితే ఆ తర్వాత సినిమాలకు దూరమైన ఆకాష్ తాజాగా ప్రముఖ సోషల్ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీ గురించి ఇంకా తన కెరీర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో రావడంతోనే మొదటి సినిమాతో అది కూడా తెలుగు రాని నేను విజయం సాధించడంతో.. చాలామంది కుళ్లిపోయారు. అయితే సెకండ్ సినిమాకి.. ఉదయ్కిరణ్ నటిస్తున్న సినిమాలో రెండో హీరోగా నన్ను పెట్టాలని, నా ఇమేజ్ డామేజ్ చేయాలని చూశారు.
అయితే అప్పుడు నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే అప్పట్లో ఉదయ్ కిరణ్ కి అమ్మాయిలలో ఎంత ఫాలోయింగ్ ఉండేదో… అదే ఫాలోయింగ్ లవర్ బాయ్ ఇమేజ్ నాకు ఉండేది. ఇద్దరికీ పోటా పోటీ పాపులారీటి. నేను హీరో కాకూడదని చాలామంది ప్లాన్స్ వేశారు. ఇక ఇదే సమయంలో తాను నిర్మించిన ఓ సినిమా స్టోరీ ఆధారంగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్(Puri Jagannath)… “ఇస్మార్ట్ శంకర్”(Ismart Shankar) సినిమా చేసినట్లు ఆరోపించారు. “ఇస్మార్ట్ శంకర్” సినిమా స్టార్ట్ అవ్వకముందే తన సినిమా స్టార్ట్ అయిందని.. చాలా షూట్ జరిగిందని.. ఆకాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో వాతావరణం ఈ రీతిగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఎవరు ఎదిగినా ఓర్చుకోలేని పరిస్థితులు ఇండస్ట్రీలో ఉంటాయని.. ఆకాష్ తన కామెంట్ల ద్వారా తెలియజేశారు.
ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…
బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…