Nani: గత కొంతకాలంగా ఏపీ ప్రభుత్వానికి తెలుగు పరిశ్రమకు మధ్య టికెట్ల ధరల విషయంలో కోల్డ్ వార్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ విషయంలో ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తప్ప, ఇంకెవ్వరూ జోక్యం చేసుకోలేదన్న విషయం కూడా తెలిసినదే. మధ్యలో ఓ రెండు మూడు సార్లు చిరంజీవి అండ్ టీమ్ ఈ విషయంలో జగన్ ను కలవడం మనం చూసాం. అయినా ఏపీ ప్రభుత్వం దిగి రాకపోవడంతో ఇప్పుడిప్పుడే టాలీవుడ్లో కొంతమంది తమ నోరు విప్పుతున్నారు.
Intisetinal Sounds: అప్పుడప్పుడు మన పొట్టలోని పేగులు శబ్దాలు చేస్తాయి..!! అలా ఎందుకు చేస్తాయో తెలుసా..!?
Nani: హీరో నాని అసలు ఏమన్నారంటే.!
టికెట్ల ధరలను ఏపీ ప్రభుత్వం కంట్రోల్ చేయడం ఇపుడు టాలీవుడ్ హీరోలకు మింగుడు పడటంలేదు. ఈ క్రమంలో హీరో నాని ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు నాని నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్ విడుదలకు సిద్ధంగా వుంది. దాంతో ఈ మూవీ ప్రమోషన్ లో పాల్గొన్న నాని తాజాగా పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చారు. అందులో భాగంగా ఈ టికెట్ల విషయం గురించి మాట్లాడారు. నాని మాట్లాడుతూ.. “ఈ క్షణం ఏది మాట్లాడిన, వివాదాస్పదం అవుతుంది కాబట్టి ఏమి మాట్లాడకపోవడమే బెటర్.” అని అంటూనే.. ఈ విషయం అన్నారు..
Leaf Plates: ఈ విస్తరాకులలో భోజనం చేస్తే ఈ అనారోగ్య సమస్యలు దూరం..!!
ఏపీ ప్రభుత్వంపై నాని విమర్శలు ఇవే..
సినిమా టికెట్ ధరలను తగ్గించి, ప్రేక్షకులని వీళ్ళు సేవ్ చేయలేదు. నిజానికి వారిని ఏపీ ప్రభుత్వం అవమానించిందని అన్నారు. ధరలు ఎంత పెంచినా టికెట్ కొనుక్కునే సామర్థ్యం సగటు ప్రేక్షకుడికి ఉంటుందని అన్నారు. ఎందుకంటే కళను ఆదరించే సంస్కృతి మనకి ఏనాటినుండో వుంది. దానికి వాళ్ళు ఎంతైనా వెచ్చిస్తారు. ప్రస్తుత దరిద్రం ఏమంటే, నలుగురికి ఉపాధి కల్పించే థియేటర్ల కలెక్షన్ల కన్నా పక్కనే కిరాణా కొట్టు పెట్టుకున్న వారికి కలెక్షన్లు దండిగా వున్నాయి అంటూ ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!