Ante Sundaraniki: న్యాచురల్ స్టార్ నాని హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన తాజా చిత్రం `అంటే..సుందరానికీ!`. ఈ మూవీతో మలయాళ ముద్దుగుమ్మ నజ్రీయా నజీమ్ టాలీవుడ్‌కి పరిచయం కాబోతోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ అండ్ లవ్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు.
ఇందులో అమాయకపు బ్రాహ్మణ యువకుడు సుందర్ ప్రసాద్ గా నాని, క్రిస్టియన్ యువతి లీలా థామస్ గా నజ్రియా నజీమ్ లు నటించారు. సీనియర్ నటుడు నరేష్, రోహిణి, నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ ముఖ్య పాత్రలు పోషించారు. కొద్ది నెలల క్రితమే షూటింగ్‌ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం జూన్ 10న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తూ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ మూవీ కథ మొదట నాని వద్దకు వెళ్లలేదట. అవును, ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ వివేక్ ఆత్రేయనే తెలియజేశారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. `ఐదేళ్ళ క్రితమే ఆ కథ ఐడియా వచ్చింది. మొదట మంచు విష్ణుతో ఈ స్టోరీని షేర్ చేసుకున్నా. ఈ కథకి నాని ఐతే బావుంటుందని అప్పుడే అనుకున్నాం.` అంటూ చెప్పుకొచ్చారు. అంటే నాని కంటే ముందే ఈ మూవీ కథను విష్ణు విన్నాడన్నమాట. ఇక ఈ చిత్రం మొత్తం ఎంతో ఆసక్తికరంగా, వినోదాత్మకంగా సాగుతుందని, ఇందులో నాని గారి చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!