NewsOrbit
సినిమా

Ante Sundaraniki: `అంటే సుందరానికీ` క‌థ నాని కంటే ముందు ఏ హీరో వ‌ద్ద‌కు వెళ్లిందో తెలుసా?

Ante Sundaraniki: న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా టాలెంటెడ్ డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ తెర‌కెక్కించిన తాజా చిత్రం `అంటే..సుంద‌రానికీ!`. ఈ మూవీతో మ‌ల‌యాళ ముద్దుగుమ్మ న‌జ్రీయా న‌జీమ్ టాలీవుడ్‌కి ప‌రిచ‌యం కాబోతోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ అండ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించారు.

ఇందులో అమాయకపు బ్రాహ్మణ యువ‌కుడు సుందర్ ప్రసాద్ గా నాని, క్రిస్టియన్ యువతి లీలా థామస్ గా నజ్రియా నజీమ్ లు న‌టించారు. సీనియర్ నటుడు నరేష్‌, రోహిణి, నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ ముఖ్య పాత్రలు పోషించారు. కొద్ది నెల‌ల క్రిత‌మే షూటింగ్‌ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం జూన్ 10న తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది.

ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తూ సినిమాపై మంచి బ‌జ్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. ఈ మూవీ క‌థ మొద‌ట నాని వ‌ద్ద‌కు వెళ్ల‌లేద‌ట‌. అవును, ఈ విష‌యాన్ని స్వ‌యంగా డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయనే తెలియ‌జేశారు.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఆయ‌న‌.. `ఐదేళ్ళ క్రితమే ఆ కథ ఐడియా వచ్చింది. మొదట మంచు విష్ణుతో ఈ స్టోరీని షేర్ చేసుకున్నా. ఈ కథకి నాని ఐతే బావుంటుందని అప్పుడే అనుకున్నాం.` అంటూ చెప్పుకొచ్చారు. అంటే నాని కంటే ముందే ఈ మూవీ క‌థ‌ను విష్ణు విన్నాడ‌న్న‌మాట‌. ఇక ఈ చిత్రం మొత్తం ఎంతో ఆస‌క్తిక‌రంగా, వినోదాత్మ‌కంగా సాగుతుంద‌ని, ఇందులో నాని గారి చాలా డిఫరెంట్ గా ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు.

 

Related posts

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N