Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `భీమ్లా నాయక్`. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. మలయాళంలో హిట్టైన `అయ్యప్పనుమ్ కోషియుమ్`కు రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ భీమ్ల నాయక్‌గా పవన్, రిటైర్డ్ ఆర్మీ అధికారి డేనియల్ శేఖర్‌గా రానా అద్భుతంగా నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతూ దూసుకుపోతున్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చి నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఈ సినిమాలో మొదట రానాను ఎంపిక చేశారు. ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యారు. అయితే భీమ్లా నాయక్ పాత్ర కోసం పవన్ కంటే ముందు మరో స్టార్ హీరోను అనుకున్నారట. ఆయనెవరో కాదు నటసింహం నందమూరి బాలకృష్ణ. అవును, పవన్ కళ్యాణ్ కంటే ముందు బాలకృష్ణ అనుకున్నారట.
సినిమా రీమేక్ అనుకున్నప్పుడు బాలకృష్ణ అయితే బాగుంటుందనే చర్చ దర్శక, నిర్మాతల మధ్య జరిగిందట. అయితే అది కేవలం ప్రారంభ చర్చ మాత్రమే అని, బాలయ్యను సంప్రదించకుండానే పవన్ లైన్లోకి వచ్చాడని తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ భీమ్లా నాయక్‌తో పవన్ మరో హిట్‌ను ఖాతాలో వేసుకుని ఫుల్ జ్యోష్‌లో ఉన్నాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!