Kajal agarwal:చందమామ లాంటి అందగత్తె కాజల్ అగర్వాల్ త్వరలోనే తల్లి కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ తన భర్తతో కలిసి ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో తన మాతృత్వ అనుభూతులను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటోంది. ఇకపోతే తెలుగులో ఈమె చివరిగా నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన విషయం తెలిసినదే.
Kajal agarwal: కాజల్ vs చరణ్?
ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ నటించిన సంగతి తెలిసినదే. గత ఏడాది చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఈ నెలలో అనగా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ పోస్టర్స్ ట్రైలర్ సాంగ్స్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ మెగా మల్టీస్టారర్ పై మరింత హైప్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో కాజల్ ఒక్క షాట్ లో కూడా లేకపోవడం పలు అనుమానాలు కలుగుతున్నాయి.
దేనికోసం ఈ రూమర్స్?
ఈ క్రమంలో తాజాగా ఓ విషయం బయటకు పొక్కింది. అదేంటంటే.. ఆచార్యలో కాజల్ కి సంబంధించిన చాలా ఎపిసోడ్స్ ను కొరటాల ట్రిమ్ చేసారని వినికిడి. ప్రెగ్నెన్సీ కారణంగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ విషయంలో ఆమె పూర్తిగా కలుగజేసుకోలేదని, డేట్స్ సర్దుబాటు చేయలేకపోయిదని, ఆ కారణంగానే ఆమె సన్నివేశాలను అనేకం తొలగించారని జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇకపోతే తన సినిమాలకు సంబంధించి ప్రతి అప్డేట్ ను సోషల్ మీడియాలో పంచుకునే కాజల్.. ఆచార్య గురించిన వార్తలను మాత్రం ప్రమోట్ చేయడంలేదు. దాంతో నెట్టింట జరుగుతున్న ప్రచారం నిజమే అని చాలా మంది అనుమానిస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!