Acharya: మెగా స్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ఆచార్య. ఈ సినిమాను ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ అందు కున్నాడు. పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ మూవీని దర్శకుడు రాజమౌళి తెరకెక్కించారు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో హీరోగా నటించాడు. చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి తన పర్ఫార్మెన్స్ తో ఈ సినిమాను మరో లెవెల్ కు తీసుకు వెళ్ళాడు. ఇక ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిపోవడంతో, చరణ్ తన నెక్ట్స్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు.
ఇప్పటికే తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ తన నెక్ట్స్ మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్సీ15గా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే కొంతమేర షూటింగ్ కూడా జరుపుకుంది. కాగా, చరణ్ ఈ సినిమా తరువాత షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నాడు చరణ్. అయితే, ఈ సినిమా కంటే ముందే ఆచార్య సినిమాతో రాబోతుం డగా దీనికి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సిద్ధ అనే పాత్రలో చరణ్ నటించాడు. ప్రస్తుతం తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలను ప్రారంభించాడు.
Acharya: దీనిపై కన్ఫర్మేషన్ ఎప్పుడొస్తుందో చూడాలి.
ఇక ఇదే నెలలో రాబోతున్న సినిమా ప్రమోషన్స్ కూడా త్వరలో స్టార్ చేయబోతున్నా రట. అయితే, చిరు సరసన నటించిన కాజల్ అగర్వాల్ ఆచార్య ప్రమోషన్స్‌కు హాజరవ డం లేదని తెలుస్తోంది. తాను ప్రెగ్నెంట్ కాబట్టే మేకర్స్ కూడా ఇబ్బంది పెట్టడం లేదు. అయితే, చరణ్ సరసన నటించిన పూజ హెగ్డే పరిస్థితి ఏంటీ అనేది ఇప్పుడు అభిమాను ల్లో కలుగుతున్న ఆలోచన. బాలీవుడ్ సినిమాలతో బిజీగా పూజా హెగ్డే ఆచార్య సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనే అవకాశాలు తక్కువే అని టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై కన్ఫర్మేషన్ ఎప్పుడొస్తుందో చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!