RRR: టాలీవుడ్లో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండదా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త వచ్చి చక్కర్లు కొడుతోంది. ఇలాంటి భారీ పాన్ ఇండియన్ సినిమాకు తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించకపోతే అభిమానులు ఊరుకుంటారా..అసలు రాజమౌళి చిత్రాలకు ఇలా ఎప్పుడైనా జరిగందా..అదే జరిగితే సినిమాను వాయిదా వేసే అవకాశాలున్నాయి..అంటూ రక రకాల వార్తలు ఇప్పుడి నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. భాహుబలి సిరీస్ తర్వాత అత్యంత భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్ఠాతంకంగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రూపొందించిన సినిమా ఆర్ఆర్ఆర్.
ఎన్.టి.ఆర్, రాం చరణ్ లాంటి ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో ఇద్దరు పోరాట యోధుల జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుంటే తారక్ కొమురమ్ భీమ్ పాత్రలో నటించాడు. ఇప్పటికే ఈ సినిమాల నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ అంచనాలను ఆకాశానికి పెంచేసింది. పట్టుమని ఈ సినిమా రిలీజ్‌కు పదిరోజులు కూడా లేదు. గత నెలరోజుల నుంచి రాజమౌళి ముంబై, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్‌లలో భారీగా ప్రమోషన్స్ నిర్వహిస్తూ వచ్చారు. ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గరపడటంతో అభిమానులు తెలుగులో జరగాల్సిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు.
RRR: ఈవెంట్ నిర్వహిస్తారా లేదా అని ప్రశ్నలు మొదలయ్యాయి.
అయితే, ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ మొదలైంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీలో అన్నీ మూసివేశారు. హిందీలో రిలీజ్ కావాల్సిన జెర్సీ సినిమా విడుదలను వాయిదా వేశారు. ఇక తెలుగులో సంక్రాంతికి రావాల్సిన ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సినిమాల పరిస్థితి ఇప్పుడు అయోమయంలో పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్ఆర్ఆర్ చిత్రానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం సాధ్యమవుతుందా అనేది అర్థం కావడం లేదు. సినిమా రిలీజ్ అనే మాట గట్టిగా వినిపిస్తోంది. అలాంటప్పుడు ఈవెంట్ నిర్వహిస్తారా లేదా అని ప్రశ్నలు మొదలయ్యాయి. చూడాలి రాజమౌళి బృందం దీనిపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!