`సాహో`పై ఫ్రెంచ్ డైరెక్ట‌ర్ సెటైర్స్‌

Share


ప్ర‌భాస్ హీరోగా సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ చిత్రం `సాహో`. ఆగ‌స్ట్ 30న తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమా భారీ లెవ‌ల్లో విడుద‌లైంది. డివైడ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ సినిమా కలెక్ష‌న్స్ మాత్రం మ‌రో రేంజ్‌లో ఉన్నాయి. అయితే `సాహో`పై ఫ్రెంచ్ డైరెక్ట‌ర్ జెరోం స‌ల్లె మాత్రం తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డాడు. `సాహో` సినిమాను తాను డైరెక్ట్ చేసిన `లార్గో వించ్‌`ను కాపీ కొట్టార‌ని ఆయ‌న అన్నారు. తెలుగులో తన సినిమాను ఆధారంగా చేసుకుని రూపొందిన రెండో సినిమా ఇదని చెప్పిన జెరోం మొద‌టి సినిమా కంటే రెండో సినిమా బాలేద‌ని అన్నారు. `నా సినిమాల‌ను కాపీ కొడితే కొట్టారు. కాస్త స‌క్ర‌మంగా చెయ్యండ‌య్యా` అంటూ ట్వీట్ పెట్టారు. అంతే కాకుండా చివ‌ర‌ల్లో `నా ట్వీట్ వ్య‌గ్యంగా ఉండొచ్చు క్ష‌మించండి` అంటూ కూడా సెటైర్స్ వేశాడు.


Share

Related posts

Samantha : ఓరి నాయనో .. పుష్ప సినిమాలో పాట కోసం సమంత కి అంత అమౌంట్ ఇచ్చారా..?!

Ram

`మ‌హ‌ర్షి` టాకీ పూర్తి

Siva Prasad

కేస‌రి @జ‌పాన్‌

Siva Prasad

Leave a Comment