నేచురల్ స్టార్ నాని హీరోగా పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ‘మళ్ళీరావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ రూపొందిస్తోన్న చిత్రం ‘జెర్సీ’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇప్పుడే జెర్సీ లాస్ట్ షాట్ పూర్తి చేశాం అంటూ నాని మెసేజ్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ సినిమాను ఏప్రిల్ 19న విడుదల చేస్తారని అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఏప్రిల్ 5న విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వినపడుతున్నాయి.
తెలుగు సినిమా ట్రెండ్ మారుతుంది. కొత్త కథలతో సినిమాలను దర్శకులు తెరకెక్కించే ప్రయత్నం చేస్తుండగా మన హీరోలు కూడా వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అదే కోవలో ఇప్పుడు నేచురల్ స్టార్ నాని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో నటించిన చిత్రమే ‘జెర్సీ’. ఈ సినిమాలో నాని అర్జున్ అనే క్రికెటర్ పాత్రలో కనిపించనున్నారు. కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తున్నారు. క్రికెటర్ కావాలనుకున్న ఓ యువకుడు కలలు కంటాడు. అయితే కొన్ని అనివార్య కారణాలతో క్రికెటర్ కాలేకపోతాడు. ముప్పై ఐదేళ్ల వయసు వచ్చిన తర్వాత ఆ యువకుడు భారత క్రికెట్ టీంకు ప్రాతినిధ్యం వహించాలనుకుంటాడు. తన కలను సాకారం చేసుకోవడానికి అతనెలాంటి సాధన చేశాడు. తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో అతనెలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నాడనేదే ప్రధాన కథాంశం.
అంచనాలు పెంచిన టీజర్
previous post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!