Categories: సినిమా

Kajal Aggarwal: త‌ల్ల‌య్యాక తొలిసారి అలాంటి పిక్ షేర్ చేసిన కాజ‌ల్‌.. నెట్టింట వైర‌ల్‌!

Share

Kajal Aggarwal: కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెర‌కెక్కిన `లక్ష్మీ కల్యాణం` సినిమాతో తెలుగు తెరకు పరిచయ‌మైన కాజ‌ల్‌.. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో అన‌తి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. తెలుగుతో పాటు త‌మిళ్‌, హిందీ భాష‌ల్లోనూ న‌టించిన ఈ అందాల చంద‌మామ‌.. నటిగా దశాబ్దపు మైలురాయిని అధిగమించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడ‌బెట్టుకుంది.

కెరీర్ డౌన్ అవ్వ‌క‌ముందే ఈ బ్యూటీ.. త‌న చిన్న‌నాటి స్పేహితుడు, ముంబైలో స్థిర‌ప‌డిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని 2020లో కరోనా లాక్ డౌన్ సమయంలో పెళ్లాడింది. వివాహం త‌ర్వాత కూడా ప‌లు సినిమాలు చేసిన కాజ‌ల్‌.. గ‌త ఏడాది గ‌ర్భం దాల్చింది. అప్ప‌టి నుంచీ సినిమాల నుంచి బ్రేక్ చేసుకున్న ఆమె..2022 ఏప్రిల్ 19న పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.

బిడ్డ పుట్టిన వెంటనే ఏమాత్రం ఆలస్యం లేకుండా `నీల్ కిచ్లూ` అంటూ కాజ‌ల్ దంప‌తులు త‌మ ముద్దుల కుమారుడికి నామ‌క‌ర‌ణం చేసి అంద‌రినీ సర్‌ప్రైజ్‌ చేశారు. అయితే కొడుకు ఫొటోను మాత్రం బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. ఇదిలా ఉంటే.. త‌ల్ల‌య్యాక కాజ‌ల్ తొలిసారి ఓ గ్లామ‌ర‌స్ పిక్‌ను తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.

గుడ్ న్యూస్ చెప్పిన కాజ‌ల్‌..ఆ సినిమాతోనే రీ ఎంట్రీ అట‌!

గ్రీన్ అండ్ ఎల్లో అవుట్ ఫిట్‌లో థై షో చేస్తూ కాజ‌ల్ సూప‌ర్ హాట్‌గా క‌నిపిస్తోంది. బిడ్డకు తల్లి అయినా తన గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పే విధంగా ఆమె ఫొటో ఉండ‌టంతో.. అది కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా, గ‌త కొద్ది రోజుల నుంచీ కాజల్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందనే వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న విష‌యం తెలిసిందే. ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు గానీ.. కాజ‌ల్ అభిమానులు మాత్రం తెగ ఆందోళ‌న చెందుతున్నారు.


Share

Recent Posts

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

24 mins ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

49 mins ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

2 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

3 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

4 hours ago

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం .. ఉత్తరాంధ్ర, యానాంలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో ..ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అర్దరాత్రికి…

5 hours ago