`ఎంత మంచివాడవురా` అంటూ ఈ సంక్రాంతికి నందమూరి కల్యాణ్ రామ్ సందడి చేయబోతున్నాడు. సతీశ్ వేగేశ్న తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ మున్నార్‌లో జరగనుంది. అక్టోబర్ 29 నుండి నవంబర్ 10వరకు జరిగే ఈ షెడ్యూల్లో కొంత టాకీ, రెండు పాటలను చిత్రీకరించనున్నారు. మెహరీన్ కథానాయిక .శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ ఇండియా (ప్రైవేట్) లిమిటెడ్ నిర్మిస్తున్న చిత్రమిది. ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త నిర్మాతలు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
previous post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!