కొత్త లుక్‌లో లోకనాయకుడు

కమల్ హాసన్ , శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు సినిమా అప్పట్లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. 22 ఏళ్ళ తరువాత మళ్లీ ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. 2. ఓ సెట్స్ మీద ఉండగానే భారతీయుడు సినిమాకు సక్వెల్ అనౌన్స్ చేశాడు దర్శకుడు శంకర్….ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్నదని సమాచారం.

భారతీయుడులో అధికారుల అవినీతి, లంచం ప్రధాన అంశాలుగా తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే రెండవ భాగం రాజకీయ నాయకుల అవినీతి గురించి ఉంటుందని తెలుస్తోంది. ఇటీవలే రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు కమల్‌హాసన్‌. అందుకే ఆయన రాజకీయ జీవితానికి ఉపయోగపడేలా ఈ సినిమా కథని రెడీ చేశాడట శంకర్.. ఇక అప్పట్లో ఇండియన్‌ తాతగా కమల్‌హాసన్‌ గెటప్‌ అదిరిపోయింది.ఇప్పుడు ఈ సీక్వెల్స్‌లో లోకనాయకుడి గెటప్‌ కోసం హాలీవుడ్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌లను రప్పించి పలు రకాల గెటప్‌లలో ఫొటో షూట్‌ చేశారు. అందులో ఒక గెటప్ అదిరిందట.ఆ గెటప్‌లో కమల్‌ని చూసిన చిత్ర యూనిట్‌ ఆశ్చర్యపోయారని తెలుస్తోంది.

ఈ సినిమాలో కమల్‌హాసన్‌కు జోడీగా కాజల్‌ అగర్వాల్‌ నటించబోతుంది. కాజల్‌కు సంబంధించిన ఫోటో షూట్‌ను అబ్రాడ్‌లో చేయనున్నారని తెలుస్తోంది. అయితే కాజల్ సంబంధించిన సన్నివేశాలను మాత్రం చెన్నైలోనే చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్‌ ఎక్కువ భాగం పొల్లాచ్చిలో శంకర్‌ ప్లాన్‌ చేసినట్లు సమాచారం. అందుకోసం అక్కడే భారీ సెట్స్‌ కూడా వేస్తున్నారట. 2.ఓ సినిమా తరువాత శంకర్‌ చేస్తున్న మూవీ కావడంతో ఇండియన్‌ 2కు అదే స్ధాయిలో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. మరి ఈ సీక్వెల్‌తో ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తారో చూడాలి..