సినిమా

KGF 2: నైజాం లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన “కేజిఎఫ్ 2”..!!

Share

KGF 2: తెలుగు సినిమా బాక్సాఫీస్ కి అత్యంత కీలకమైన ఏరియా నైజాం. ఈ ప్రాంతంలో హిట్ అడిగింది అంటే సదరు హీరో కెరియర్ తిరుగులేకుండా ఉంటుంది. నైజాం ఏరియాలో ఎక్కువ మార్కెట్ కలిగిన తెలుగు హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ.. కొత్తగా విజయ్ దేవరకొండ. వీళ్లు మినహా తెలుగు సినిమా రంగంలో చాలా వరకు నైజాంలో మార్కెట్ లేదు. అటువంటి ఈ ప్రాంతంలో “కేజిఎఫ్ 2” సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. kgf 2 creates a new record in nizamఏకంగా 40 కోట్ల రూపాయల షేర్ నైజాంలో కలెక్ట్ చేయడం జరిగింది. ఈ పరిణామంతో నైజాంలో ఇతర భాషల నుండి డబ్ అయినా “KGF 2” అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. ఏప్రిల్ 14 వ తారీకు విడుదలైన ఈ సినిమా దేశ వ్యాప్తంగా అన్నిచోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగులో కూడా తిరుగులేని కలెక్షన్స్ సాధించడం జరిగింది. kgf 2 creates a new record in nizam“కేజిఎఫ్” మొదటి చాప్టర్ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో… అదే స్థాయిలో సెకండ్ చాప్టర్ ఉండటంతో.. విడుదలైన రెండు వారాలకే దేశ వ్యాప్తంగా ఈ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా ఓవరాల్ రన్ టైం లో… మరో 300 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దీంతో “కేజిఎఫ్” ఫస్ట్, సెకండ్ చాప్టర్ లు.. సూపర్ డూపర్ హిట్ కావడంతో మూడో చాప్టర్ కూడా ఉన్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ హింట్ ఇవ్వటంతో… ప్రేక్షకులు మూడవ భాగం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ మూడో చాప్టర్ ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యే అవకాశాలు లేనట్లు కన్నడ ఫిలిం ఇండస్ట్రీ టాక్.


Share

Related posts

విక్ర‌మ్ సినిమాను కామెంట్ చేసిన హీరోయిన్‌

Siva Prasad

Ram charan : రామ్ చరణ్ సినిమాలో ఇంతమంది సూపర్ స్టార్స్ నటిస్తున్నారా..?

GRK

ఎప్పుడో మొదలైన పుష్ప మీద నమ్మకం లేదు ..అసలు మొదలే కాని సర్కారు వారి పాట మాత్రం పక్కా నా ..?

GRK