KGF: “కేజిఎఫ్” రెండు భాగాలు తిరుగులేని విజయాలను నమోదు చేసుకోవడం తెలిసిందే. భారతీయ చలన చిత్ర రంగంలో అతి చిన్న సినీ ఇండస్ట్రీ కన్నడ నుండి డబ్ అయి విడుదలైన ప్రతి చోట “కేజిఎఫ్” మొదటి భాగం అదేవిధంగా రెండో భాగం రికార్డు స్థాయి కలెక్షన్స్ సాధించడం జరిగింది. “కేజిఎఫ్” విజయంతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ హీరో యాష్…లకి మంచి గుర్తింపు రావడం తెలిసిందే. ప్రశాంత్ నీల్… టేకింగ్.. సినిమాని నడిపించే విధానం చూసిన ప్రతి ఒక్కరూ సౌత్ మొదలుకొని నార్త్ వరకు… రాజమౌళికి తగ్గ దర్శకుడు అని కితాబిచ్చారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అదేవిధంగా హీరో యాష్ కి తిరుగులేని ఫాలోయింగ్ ఏర్పడింది. వీరిద్దరికీ మాత్రమే కాదు హీరోయిన్ శ్రీనిధి శెట్టికి కూడా మంచి పేరు రావటం జరిగింది. “కేజిఎఫ్” తన కెరీర్ లో మొదటి సినిమా అయినా గాని శ్రీనిధి శెట్టి… చాలామంది యువ హృదయాలను దోచుకోవడం జరిగింది. ఇక రెండో భాగం లో కూడా… అదరగొట్టే పెర్ఫార్మెన్స్..తో పాటు గ్లామర్ పరంగా మరింత క్రేజ్ సంపాదించడం జరిగింది. “KGF 2” మొదటి భాగం కంటే తిరుగులేని విజయం సాధించడంతో..శ్రీనిధి శెట్టి రెమ్యూనరేషన్ విషయంలో ఏ మాత్రం తగ్గటం లేదంట.
మొదటి రెండు సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో తిరుగులేని విజయం సాధించడంతో… ఆల్రెడీ విక్రమ్ హీరో కోబ్రా సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇప్పుడు మరిన్ని అవకాశాలు వస్తూ ఉండటంతో KGF ఎఫెక్ట్ తో శ్రీనిధి శెట్టి… రెమ్యూరేషన్ గతంలో కంటే మరింతగా పెంచేసినట్లు వార్తలు ఇండస్ట్రీలో వినబడుతున్నాయి. దేశవ్యాప్తంగా శ్రీనిధి శెట్టికి “కేజిఎఫ్” మూవీతో మంచి మార్కెట్ క్రియేట్ కావడంతో నిర్మాతలు కూడా… ఎంత ఇవ్వడానికైనా సిద్ధం అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!