Salaar: “కేజిఎఫ్” సినిమాలతో తిరుగులేని డైరెక్టర్ అనిపించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేస్తున్న “సలార్” సినిమా షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. గత రెండు సంవత్సరాలు కరోనా నేపథ్యంలో అనేక ఆటంకాలు ఎదురైనా సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గడంతో సాధారణ పరిస్థితి ఉండటంతో “సలార్” సినిమా షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది.
ముఖ్యంగా ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ త్వరగా కంప్లీట్ అయ్యేలా మేకర్స్ నీ తొందర పెడుతున్నాడట. పాన్ ఇండియా లెవెల్ లో “బాహుబలి 2” ఎన్ని రికార్డులు సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యాం రెండు సినిమాలకు దాదాపు మూడున్నర సంవత్సరాలు టైం కేటాయించటం, సినిమా రిజల్ట్ చూస్తే అట్టర్ ప్లాప్ కావడంతో.. “సలార్” సినిమా విషయంలో టైం వేస్ట్ అవకుండా ప్రభాస్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అయితే ఈ తరుణంలో ఇటీవలే ఓ షెడ్యూల్ కంప్లీట్ కాగా మరో షెడ్యూల్ హైదరాబాద్ లో “సలార్” సినిమా యూనిట్ ప్లాన్ చేయడం జరిగిందట.
ఈ తాజా షెడ్యూల్ లో పవర్ ప్యాక్ ఫైట్స్ .. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు షూట్ చేయబోతున్నారట. “సలార్” లో ఈ మూడు యాక్షన్ సన్నివేశాలు చాలా హైలెట్ గా ఉండబోతున్నట్లు… ఈ భారీ ఫైట్లు కోసం అత్యాధునిక టెక్నాలజీ.. కెమెరాలను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వాడనున్నట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి కొత్త అప్ డేట్ రానున్నట్లు సమాచారం. కేజిఎఫ్ డైరెక్టర్ కావడంతో “సలార్” పై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…
Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…
Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…
AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…
Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…