తమిళ సినిమా రంగంలో విషాదం చోటుచేసుకుంది. ఫేమస్ ఫిలిం క్రిటిక్ కౌశిక్ ఎల్ ఎం హఠాన్మరణం చెందారు. నిద్రిస్తున్న సమయంలోనే కార్డియాక్ అరెస్ట్ తో తుది శ్వాస విడిచారు. 35 సంవత్సరాల వయసు కలిగిన కౌశిక్ 1987లో జన్మించడం జరిగింది. తమిళ సినిమా రంగంలో రివ్యూ రాయటం.. ఇంకా కోలీవుడ్ నటీనటుల దగ్గర ఇంటర్వ్యూలు తీసుకుని మంచి పాపులారిటీ సంపాదించారు. యుక్త వయసులోనే కౌశిక్ మరణించడం పట్ల కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు మరియు తోటి ఫిలిం క్రిటిక్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఇదే సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. తమిళ ఇండస్ట్రీలో విడుదలయ్యే కొత్త సినిమాలకు సంబంధించి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఎప్పటికప్పుడు రివ్యూలు ఇవ్వటంతో పాటు సినిమా రికార్డుల అప్ డేట్స్ ఇస్తూ మంచి పాపులారిటీ సంపాదించాడు. వృత్తిరీత్యా ఇంజనీర్ అయినా గాని ఎంటర్టైన్మెంట్ రంగంపై ఇష్టంతో తమిళ యూట్యూబ్ ఛానెల్ బిహైండ్వుడ్స్లో ఫిల్మ్ క్రిటిక్ గా వృత్తిని ప్రారంభించాడు. ఒక్క సినిమాలు మాత్రమే కాదు క్రీడలు క్రికెట్ మరియు టెన్నిస్ లకి సంబంధించి అనేక విశేషాలు కూడా తెలియజేస్తూ ఉంటాడు.
కోలీవుడ్ ప్రముఖ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే విధానంలో చాలా ఎంటర్టైన్మెంట్ పండిస్తూ మరోపక్క బ్రిలియంట్ ప్రశ్నలు వేస్తూ.. కౌశిక్ ఎంతో మంచి పాపులారిటీ సంపాదించడం జరిగింది. కౌశిక్ తో ఇంటర్వ్యూ అంటే చాలామంది సెలబ్రిటీలు కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉండేది. దీంతో కౌశిక్ మృతి చెందిన వార్త బయటకు రావడంతో నటి కీర్తి సురేష్, రష్మిక మందన, విజయ్ దేవరకొండ, హరీష్ కళ్యాణ్, దుల్కర్ సల్మాన్.. కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు, ధనుష్, టెలివిజన్ యాంకర్ దివ్యదర్శిని సహా పలువురు ప్రముఖులు కౌశిక్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆయన ఫాలోవర్స్ కూడా కౌశిక్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చాలా చిన్న వయసులో 35 సంవత్సరాలకే కార్డియాక్ అరెస్టుతో కౌశిక్ మరణించడం పట్ల చాలామంది షాక్ అవుతున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!