krithi shetty: కృతి శెట్టి.. ఈ పేరుకు ఇప్పుడు పరిచయాలే అక్కర్లేదు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా రూపుదిద్దుకున్న `ఉప్పెన` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కృతీ.. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుని సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత కృతి శెట్టి నటించిన శ్యామ్ సింగ్ రాయ్ హిట్టైంది.
తాజాగా విడుదలైన బంగార్రాజు కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తుండడంతో.. కృతీ హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మొత్తానికి వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ అందాల భామ.. ఓ స్టార్ హీరోపై మనసు పారేసుకుంది. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బంగార్రాజు ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి.. సినిమా గురించి ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది. అలాగే ఈ సందర్భంగా తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెబుతూ.. తనకు రామ్ చరణ్ అంటే ఇష్టమని, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్ తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పుకొచ్చింది. అంతేకాదు, అవకాశం దొరికితే రామ్ చరణ్‌తో నటించాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టేసింది. మరి కృతి కోరిక తీరి త్వరలో చరణ్‌తో నటించే అవకాశం దక్కిందనే గుడ్‌న్యూస్‌ను చెబుతుందో లేదో చూడాలి.
కాగా, ప్రస్తుతం ఈ భామ సుధీర్ బాబుకు జోడీగా `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, నితిన్ సరసన `మాచర్ల నియోజకవర్గం`, రామ్‌తో `ది వారియర్` చిత్రాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ మూడు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!