బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన కొత్త సినిమా “లాల్సింగ్ చద్దా”. ఆగస్టు 11 వ తారీకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పణలో విడుదలవుతుంది. ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటించడం తెలిసిందే. ఇటీవల నాగచైతన్యకి సంబంధించిన లుక్ కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ‘లాల్సింగ్ చద్దా’ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అమీర్ ఖాన్ పై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ చలనచిత్ర రంగానికి అమీర్ ఖాన్ ఒక ఖజానా లాంటివాడని తెలిపారు. “లాల్సింగ్ చద్దా” సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిరంజీవి కొనియాడారు.
వైవిధ్యమైన పాత్రలతో.. అమీర్ ఖాన్ గొప్ప నటుడు అనిపించుకున్నారని చెప్పుకొచ్చారు. గొప్ప నటుడు అయినా గాని అమీర్ నడవడిక మరియు వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం అని చిరంజీవి పేర్కొన్నారు. తొందరపడి కాదు చాలా గర్వపడి ‘లాల్సింగ్ చద్దా’ మూవీ తెలుగులో సమర్పిస్తున్నట్లు తెలియజేశారు. అద్విత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 11 వ తారీకు విడుదల కానుంది. కరీనాకపూర్ హీరోయిన్. కొన్ని వారాల క్రితం ‘లాల్సింగ్ చద్దా’ ప్రీమియర్ షో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో వేశారు.
అమీర్ ఖాన్ ‘లాల్సింగ్ చద్దా’ స్పెషల్ షో చూశాక చిరంజీవి సంచలన నిర్ణయం..!!
ఆ సమయంలో హీరో అమీర్ ఖాన్ తో పాటు.. నాగచైతన్య, నాగార్జున, రాజమౌళి, సుకుమార్ చూడటం జరిగింది. సినిమా చూసిన వెంటనే చిరంజీవి.. హీరో అమీర్ ఖాన్ నీ పొగడ్తలతో ముంచేతడంతోపాటు హత్తుకుని.. శాలువాతో సత్కరించారు. ఆ తర్వాత వెంటనే తెలుగులో ఈ సినిమాని తానే సమర్పిస్తానని చిరంజీవి నిర్ణయం తీసుకుని.. విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. ఈ క్రమంలో జులై 24వ తేదీ ఆదివారం నాడు ‘లాల్సింగ్ చద్దా’ తెలుగు ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో.. హీరో అమీర్ ఖాన్ నీ చిరంజీవి పొగడ్తలతో ముంచెత్తారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!