హీరో అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కామెడీ హీరోగా అందరినీ అలరించాడు.. గత కొన్నేళ్లుగా కామెడీ సినిమాలకు అల్లరి నరేష్ కేరాఫ్ అడ్రస్ గా మారారు.. తన మొదటి సినిమాతోనే తన నటనతో మెప్పించాడు. అంతేకాదు తొలి సినిమా టైటిల్ నే తన ఇంటి పేరుగా మార్చుకొని అల్లరి నరేష్ అయ్యాడు. ఆయన సినిమాలకు వెళ్లి ప్రేక్షకులు హాయిగా నవ్వుకొని థియేటర్ నుంచి బయటికి వస్తారు.. అప్పట్లో అల్లరి నరేష్ వరుస సినిమాలతో బిజీగా ఉండేవారు.. కానీ ఈమధ్య మాత్రం చాలా తక్కువగా సినిమాలు చేస్తున్నారు.. అంతేకాదు కామెడీని పక్కన పెట్టి తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు రుచి చూపించారు.
అల్లరి నరేష్ రీల్ లైఫ్ లో కామెడీ హీరోనే అయినా, రియల్ లైఫ్ లో మాత్రం చాలా సీరియస్, సిన్సియర్ గా ఉంటారట.. కానీ సినీ ఇండస్ట్రీ అంటేనే నటన.. ఎంత సిన్సీయర్ గా ఉన్నా ప్రయోజనం ఉండదు.. ఇది తెలియకుండా అల్లరి నరేష్ ఓ హీరోయిన్ ని ప్రేమించి మోసపోయాడు.. అల్లరి నరేష్ తన కెరీర్ మొదట్లో ఓ హీరోయిన్ ని ప్రేమించారట.. ఆ హీరోయిన్ కూడా నరేష్ ని ప్రేమించిందట.. ఎందుకంటే అప్పట్లో అల్లరి నరేష్ కి ఎంతో క్రేజ్ ఉండేది.. మంచి హిట్ సినిమాల్లో నటిస్తూ బాగా సంపాదించేవాడు.
అభిమానుల్లోనూ నరేష్ కి ఎంతో క్రేజ్ ఉండేది. అంతటి క్రేజ్ ఉన్న హీరోను ఎవరైనా వదులుకుంటారా.. ఆ హీరోయిన్ కూడా నరేష్ తో ప్రేమ ఉన్నట్లు నటించింది. కొన్నాళ్లు నరేష్ తో ఎంజాయ్ చేసింది. నరేష్ ఆమెను పెళ్లి చేసుకుందామనుకున్నాడు. ఈ విషయం చెప్పేసరికి ఆ హీరోయిన్ నరేష్ కి బ్రేకప్ చెప్పేసింది. నీలాంటి కామెడీ హీరోను నేను పెళ్లి చేసుకోవడం ఏంటీ అని నవ్విందట.. నరేష్ కి బ్రేకప్ చెప్పి ఆయన ఫ్రెండ్ అయినా మరో కోలివుడ్ స్టార్ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!