Liger: గత కొన్నాళ్ళ నుండి వరస ఫ్లాపుల్లో ఉన్నాడు విజయ్ దేవరకొండ. ఇటువంటి తరుణంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగర్” అనే పాన్ ఇండియా సినిమా చేయటంతో.. దీనిపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరోపక్క డైరెక్టర్ పూరీ తన కెరియర్ “లైగర్” ది బెస్ట్ అని.. పలు ఇంటర్వ్యూలలో చెప్పటం జరిగింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఇంటర్నేషనల్ బాక్సర్ గా కనిపిస్తున్నాడు. మరోపక్క చాయ్ వాలా క్యారెక్టర్ కూడా చేయడం జరిగింది. చాయ్ వాలా నుండి ఇంటర్నేషనల్ బాక్సర్ గా.. విజయ్ దేవరకొండ ప్రయాణం “లైగర్” లో… సరికొత్త క్యారెక్టరైజేషన్ తో పూరి తన మార్క్ పంచ్ డైలాగులతో తెరకెక్కించినట్లు సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. సినిమాలో ఇంటర్నేషనల్ బాక్సర్ మైక్ టైసెన్ కూడా నటించడంతో…”లైగర్” కోసం హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. అయితే సినిమా ఆగస్టు మాసంలో రిలీజ్ కానున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించడం తెలిసిందే. ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ అవ్వకముందే “లైగర్” సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. విషయంలోకి వెళితే ఈ సినిమాకి సంబంధించి ఆడియో హక్కులు సోనీ మ్యూజిక్ దాదాపు 14 కోట్ల రూపాయలకు సొంతం చేసుకోవడం జరిగింది అని టాక్.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ తరహా రేటు గత కొద్ది సంవత్సరాల నుండి ఏ యంగ్ హీరోకి పలకలేదని.. విజయ్ దేవరకొండ “లైగర్” కి అంత ధర రావడం జరిగిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించడం జరిగింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిర్మాత గా కూడా సినిమాలు చేయడం జరిగింది. పూరి ఒక్కడే కాకుండా బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్ కూడా నిర్మాణ భాగస్వామ్యంలో చేతులు కలిపారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ వర్క్ మొత్తం కరణ్ జోహార్ చూసుకుంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!