SVP: “సర్కారు వారి పాట” ఈ వేసవి కానుకగా మే 12వ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. “గీతా గోవిందం” డైరెక్టర్ పరుశురాం ఈ సినిమాలో మహేష్ బాబుని గతంలో ఎన్నడూ చూపించని రీతిలో… డిఫరెంట్ మాస్ అండ్ క్లాస్ క్యారెక్టర్ లో చూపించనున్నట్లు… వార్తలు వస్తున్నాయి. పైగా సినిమా పోకిరి మాదిరిగా ఉంటుందని మహేష్ స్వయంగా చెప్పడం సినిమాపై అంచనాలు పెంచేసినట్లయింది.
ఇదే సమయంలో ఇటీవల సినిమా లో ఫస్ట్ సింగల్ మెలోడీ కళావతి సాంగ్ రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ రెస్పాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అంత మాత్రమే కాక యూట్యూబ్ లో 75 మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా నుండి రెండో సింగిల్ రాబోతున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలియజేశారు. అయితే ఇది పూర్తిగా మాస్ నేపథ్యంలో వస్తున్నట్లు పాటల రచయిత అనంత శ్రీరామ్ మరియు డైరెక్టర్ పరుశురాం.. తమన్ తో మాస్ తరహాలో ఫోటోకి ఫోజ్ ఇచ్చారు.
దీంతో “కళావతి” అనే మెలోడీ సాంగ్ అనేక రికార్డులు సృష్టించడంతో..రాబోయే మాస్ సాంగ్ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో అని అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు. ఇటీవల తమన్ అందిస్తున్న మ్యూజిక్..కి భారీ ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. అఖండ, బీమ్లా నాయక్ సినిమాలలో ఇదే రుజువయ్యింది. రెండు సినిమాలలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చించేసింది. దీంతో ఇప్పుడు సర్కారు వారి పాట వంతు వస్తూ ఉండటంతో.. తమన్ ఎటువంటి మ్యాజిక్ సృష్టిస్తాడో అనేది ఆసక్తికరంగా మారింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!