SVP: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గత కొద్ది సంవత్సరాల నుండి బయోపిక్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చాలా మంది రాజకీయ నాయకులు మరియు క్రీడాకారులు, సినీ సెలబ్రిటీల నిజ జీవితాలను బయోపిక్ గా చిత్రీకరిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి.. ఇంకా అందాల నటి సావిత్రి బయోపిక్ సినిమాలు ఇప్పటికే వచ్చాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇటువంటి తరుణంలో తాజాగా సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ గురించి ప్రస్తావన వచ్చింది. పూర్తి విషయంలోకి వెళితే స్వయంగా మహేష్ ప్రొడ్యూస్ చేసిన సినిమా మేజర్. యంగ్ హీరో అడివి శేష్ నటించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఇటువంటి తరుణంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
ఈ టైంలో సూపర్ స్టార్ బయోపిక్ సినిమా ప్రస్తావన వచ్చింది. నాన్నగారు బయోపిక్ మీరు చేస్తారా అని మహేష్ బాబు ని ప్రశ్నించారు. దానికి మహేష్ సమాధానమిస్తూ కృష్ణ గారి బయోపిక్ ఎవరైనా తీస్తే మొదటిగా చూసి సంతోషించేది నేనే. నాన్న గారి బయోపిక్ నేను తీయను. ఎందుకంటే ఆయనే నా దేవుడు, అవసరం అయితే సినిమా నిర్మించడానికి ముందుకు వస్తాను అని మహేష్ తెలియజేశారు. మహేష్ నిర్మించిన “మేజర్” సినిమా జూన్ మూడో తారీకు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!