90ల్లో సీనియర్ నటిగా సీనియర్ అగ్రహీరోల సరసన నటించి మెప్పించిన హీరోయిన్స్‌లో మీనా ఒకరు. పెళ్లి తర్వాత ఈమె కొన్నాళ్లు పాటు సినిమా రంగానికి దూరమైయ్యారు. బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన మీనా సినిమాల్లోనూ అడపా దడపా నటిస్తున్నారు. అయితే త్వరలోనే ఈమె డిజిటల్ మీడియాలోనూ సందడి చేయబోతున్నారు. `కరోలిన్ కామాక్షి` పేరుతో ఓ వెబ్ సిరీస్ రూపొందనుంది. వివేక్ కుమరన్ దీన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో మీనా లేడీ సీబీఐ ఆఫీసర్ పాత్రలో కనపడతారట. ఈమె పాత్రను డైరెక్టర్ కామిక్‌గా డిజైన్ చేశారట. ఆద్యంతం పాత్ర నవ్విస్తూనే కనపడుతుందట.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!