Mehreen: మరో మిల్క్ వైట్ బ్యూటీ మెహ్రీన్ గురించి అందరికీ తెలిసిందే. నాని హీరోగా వచ్చిన ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు అనతికాలంలోనే మంచి నటిగా పేరు సంపాదించుకుంది. ఇక ఆ సినిమాతో ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే ఎంత టాలెంట్ వున్నా, ఒకింత అదృష్టం వుండాలన్నట్టు, ఈమెకి అవకాశాలు నత్తనడక సాగుతున్నాయి. కేవలం మీడియం రేంజ్ హీరోల సరసన మాత్రమే నటిస్తోంది. అయితే ఆ మధ్య ఎఫ్ 2తో హిట్టుకొట్టిన అమ్మడు త్వరలో ఎఫ్ 3 మూవీతో ప్రేక్షకులను పలకిరించనుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Mehreen: బడా హీరోతో రొమాన్స్
తాజాగా ఈ భామ ఓ బడా హీరో సినిమాలో మెయిన్ హీరోయిన్గా యాక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో ఈమెనే ఫైనలైజ్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. బోలెడంత గ్లామర్ ఉన్న.. మెహ్రీన్‌కు హీరోయిన్గా ఇంకా బిగ్ బ్రేక్ రాలేదనే చెప్పాలి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజా ది గ్రేట్’ మూవీ మెహ్రీన్‌కు మంచి పేరు తీసుకొచ్చినా అవకాశాలను మాత్రం తీసుకురాలేకపోయింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మరింత సమాచారం
చిన్నపుడే మోడలింగ్‌లో రాణించిన ఈమె తర్వాతకాలంలో నటిగా మారింది. మెహ్రీన్ 5 నవంబర్ 1993లో పంజాబ్ రాష్ట్రంలోని భటిండాలో జన్మించింది. ఈమె తెలుగుతో పాటు తమిళ, హిందీ, పంజాబీ సినిమాలలో కూడా నటించి, నటిగా తన ముద్రను వేసుకుంది. ఇక సోషల్ మీడియాలో ఈమె నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. ఆ మధ్య హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనవడు భవ్య బిష్ణోయ్‌తో ఆమె నిశ్చితార్ధం జరిగింది. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు గాని, వీరిద్దరు పెళ్లి చేసుకోవడం లేదంటూ ప్రకటించారు. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలతో ఫుల్లు బిజీగా ఉంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!