Samantha: హీరోయిన్ సమంత పరిస్థితి ఇప్పుడు చాలా దయనీయంగా ఉన్న సంగతి తెలిసిందే. “ఏ మాయ చేసావే” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సామ్ అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలు మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ, పవన్ కళ్యాణ్ మరి కొంతమంది హీరోలతో అవకాశాలు అందుకుంది. ఆ తర్వాత నాగచైతన్యాతో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం తెలిసిందే. 2017లో వేరే వివాహం కాగా 2021లో వీరిద్దరూ విడిపోవడం జరిగింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్న సమంత దక్షిణాది సినిమాలతో పాటు హిందీలో కూడా అవకాశాలు అందుకుంది. అన్ని చోట్ల విజయం సాధించింది.

2021లో “పుష్ప” లో ఐటమ్ సాంగ్ చేసి ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. చైతుతో విడాకులు తీసుకున్న తర్వాత కెరియర్ పరంగా ఫుల్ బిజీ అవుతున్న సమంత గత ఏడాది అక్టోబర్ నెలలో అరుదైన మయోసైటీస్ వ్యాధికి గురికావడం తెలిసిందే. అప్పటినుండి మంచానికి పరిమితం అయింది. ఇది చాలా ప్రాణాంతకరమైన వ్యాధి కావడంతో పాటు.. సమంతా థర్డ్ స్టేజిలో ఉంది. ఈ పరిణామంతో సినిమా షూటింగ్స్ మొత్తం క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. దాదాపు రెండు నెలలకు పైగానే సమంత ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది. ఇలాంటి తరుణంలో ఇటీవల “శాకుంతలం” సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి చాలా రోజుల తర్వాత సమంత హాజరైంది. దీంతో సమంత కార్యక్రమంలో చాల ఎమోషనల్ గా కూడా కన్నీరు పెట్టుకోవడం జరిగింది.

“శాకుంతలం” ట్రైలర్ వేడుకకి సమంత రావటంతో మరోసారి ఆమె ఆరోగ్యం పై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఆమెకు అందం తగ్గిపోయింది అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. చాలా నీరసంగా..గ్లో చాలావరకు సమంత ముఖంలో కోల్పోయింది అని బజ్ బాస్కెట్ కామెంట్ చేయడం జరిగింది. దీంతో సమంత ఊహించని విధంగా స్పందించి..”నాలాగా నెలలు తరబడి చికిత్స తీసుకునే పరిస్థితి ఎవరికి రాకూడదు అని భగవంతుడికి ప్రార్ధన చేస్తున్న. అలాగే నువ్వు బాగుండాలని కోరుకుంటున్నా అంటూ సమంత రిప్లై ఇవ్వడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.