అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య తనదైన శైలిలో రాణిస్తున్నాడు. నాగార్జున వారసుడిగా అక్కినేని అభిమానులను అలరిస్తూ ఆ లెగసీని కొనసాగిస్తున్నాడు. క్లాస్ మరియు మాస్ ప్రేక్షకులను అలరిస్తూ సరికొత్త చిత్రాలతో వైవిధ్యమైన కథలతో ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. అక్కినేని ఫ్యామిలీ నుండి అఖిల్ ఎంట్రీ ఇచ్చిన గాని తమ్ముడు తో పోలిస్తే అన్న నాగచైతన్య కే ఎక్కువ హిట్స్ ఉన్నాయి. చూడటానికి చాలా కూల్ మరియు సైలెంట్ గా ఉండే నాగచైతన్య పెళ్లి జీవితం గత ఏడాది ఇబ్బందుల్లో పడటం జరిగింది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత నాగచైతన్య ఇద్దరు చర్చించుకుని విడిపోవడం తెలిసిందే. ఆ తర్వాత నాగచైతన్య వరుస పెట్టి సినిమాలు చేస్తూ అలరిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏకంగా మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో “లాల్ సింగ్ చడ్డా” సినిమా చేయటం జరిగింది. ఆగస్టు 11 వ తారీకు ఈ సినిమా విడుదల కానుంది. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ డైరెక్టర్ తో నాగచైతన్య సినిమా ఛాన్స్ అందుకున్నట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతుంది.
విషయంలోకి వెళ్తే బాలీవుడ్ ఇండస్ట్రీలోనే అతిపెద్ద దర్శకుడిగా పేరొందిన సంజయ్ లీల భన్సాలి ఇటీవల చైతుకి ఒక స్టోరీ వినిపించడం జరిగిందంట. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వీరిద్దరి మధ్య స్టోరీ డిస్కషన్ జరిగినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో నాగచైతన్యతో “దేవదాసు” లాంటి సినిమా చేయాలని అక్కినేని అభిమానులు భన్సాలినీ సోషల్ మీడియాలో కోరుతున్నారు. ఒకపక్క తెలుగులో దూసుకుపోతున్న నాగచైతన్యకి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పెద్దపెద్ద అవకాశాలు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!