కొణిదెల వారి పెళ్ళి సందడి మామూలుగా లేదు. మరో రెండు రోజుల్లో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నా నిహారిక ముస్తాబు అవుతున్న తీరు అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు టాలీవుడ్లో తానే ట్రేడింగ్. నిహారిక డిసెంబర్ 9వ చైతన్యను వివాహం చేసుకోబుతున్న విషయం తెలిసిందే. ఈ పెళ్ళి వేడుక రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరుగుతుంది. ఈ తరుణంలో తను అల్లారిముద్దుగా పెంచుకున్న చిట్టితల్లి నిహారిక మరొక ఇంటికి కోడలుగా వెళుతుండడంతో నాగబాబు భావోద్వేగానికి గురయ్యారు.
తాజాగా ఇన్‌స్టాలో నిహారికను పెళ్లికుమార్తెగా అలంకరించినప్పుడు తీసిన ఓ ఫోటోను షేర్ చేశారు.”ఈ కుటుంబం నుంచి నీ ఎదుగుదల మెుదలైంది. తండ్రిగా నీకు స్వేచ్ఛను ఇచ్చాను … ఈ విహంగ వీక్షణంలో రెక్కలు కట్టుకొని ఎగిరిపో. ఈ కుటుంబం ఇచ్చిన దైర్యం నీకు రక్షణగా ఉంటుంది. నిన్ను ప్రేమించే తండ్రిగా నీకు అందించే గొప్ప బహుమతి.. ఐ లవ్యూ చందమామ.. ఎప్పటికి గుర్తిండిపోయే ప్రేమా!” అనే క్యాప్షన్‌తో ఈ పోస్ట్ పెట్టారు. గుంటూరు ఐజీ ప్రభాకర్‌రావు కుమారుడు చైతన్యతో నిహారిక వివాహం జరగనుంది. డిసెంబర్ 9న ఈ జంట ఒకటి కానుంది. ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌విలాస్ హోటల్లో ఈ వివాహ సంబంరం జరగనుంది. పెళ్లి డిసెంబర్ 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథుల లగ్నంలో జరుగతుంది.
నిహారిక కొన్ని సినిమాలు హీరొయిన్‌గా నటించిన విషయం తేలిసిందే. అలాగే పలు వెబ్ సిరీస్‌లో కూడా నటించి అభిమానులను అలరించింది. కొన్ని షోలకు యాంకర్‌గా కూడా చేసింది. ‘ఒక మనసు’ ‘హ్యాపీ వెడ్డింగ్’,‘సూర్యకాంతం’ లాంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. మెగా ప్యామీలి నుంచి చాలా మంది హీరోలుగా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం కాగా.. ఆ కుటుంబం నుంచి ఏకైక కథనాయిక నిహారిక మాత్రమే!