అక్కినేని నాగార్జున కు యాక్షన్ జోనర్ లో ఆఖరిపోరాటం, మాస్ జోనర్ లో శివ, కామెడీలో హలోబ్రదర్, భక్తి రూపంలో అన్నమయ్య.. బ్లాక్ బస్టర్ హిట్స్ సాధిస్తే.. ఫ్యామిలీ జోనర్ లో బ్లక్ బస్టర్ ను ‘నిన్నే పెళ్లాడతా’ అందించింది. 90వ దశకంలో కుర్రాళ్లు, అమ్మాయిలకు తన స్టైల్ తో పిచ్చెక్కించిన నాగార్జున యువ సామ్రాట్ గా వెలిగిపోయాడు. విపరీతమైన ఫాలోయింగ్ తో యూత్ ఐకాన్ గా చెలరేగిపోయాడు. కానీ.. ఫ్యామిలీ ఆడియన్స్ చేరువకాని లోటును ‘నిన్నేపెళ్లాడతా’ తీర్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ఈ సినిమా విడుదలై నేటికి 24 ఏళ్లు పూర్తి చేసుకుంది.
1996 అక్టోబర్ 4న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. నాగార్జున చార్మింగ్ లుక్ ఓ సెన్సేషన్ అయిపోయింది. నాగ్ స్టైల్, హెయిర్ స్టైల్ యూత్ పిచ్చెక్కిపోయారు. కాలేజీ అమ్మాయిలు ఫిదా అయిపోయారు. లవ్ స్టోరీకి ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్ చేసి మ్యాజిక్ చేశాడు దర్శకుడు కృష్ణవంశీ. ప్రేక్షకులకు కొత్త తరహా టేకింగ్, మేకింగ్ చూపించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. తొలి సినిమా గులాబీతో హిట్ కొట్టాడు కృష్ణవంశీ. అయితే.. వర్మ శిష్యుడు అనిపించాడు అనే పేరు వచ్చింది. ఇది కేవీకి నచ్చలేదు. దీంతో తానేంటో నిరూపించుకోవాలని తపించాడు. దీంతో వర్మ టచ్ చేయని ఫ్యామిలీ కంటెంట్ ఆలోచించి నిన్నే పెళ్లాడతా కథ రాసుకున్నాడు.
నిజంగానే తన మ్యాజిక్ వేరే అని ‘నిన్నేపెళ్లాడతా’తో నిరూపించాడు. ప్రేక్షకుల్ని చక్కిలిగింతలు పెట్టే లవ్, ఫ్యామిలీ డ్రామాను అద్భుతంగా తెరకెక్కించాడు. తెర నిండా నటులతో కొత్తగా సరదాగా అనిపించే సినిమా ఇచ్చాడు. నాగార్జున-టబు కాంబినేషన్ మెప్పించింది. సందీప్ చౌతా సంగీతంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కింది. 39 సెంటర్లలో 100 రోజులు, 5 సెంటర్లలో 175 రోజులు రన్ అయింది. నాగ్ కెరీర్లో అతిపెద్ద ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా నిలిచిపోయింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!