Agent: అక్కినేని అఖిల్ నటించిన “ఏజెంట్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్ లో ఆదివారం జరిగింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తేరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 28వ తారీకు విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నాగార్జున ముఖ్యఅతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “నిజంగానే అఖిల్ చెప్పినట్టు… మా కుటుంబ సభ్యులందరికీ సినిమాలంటే పిచ్చి. అభిమానులు అంటే ప్రేమ. ఒక కొత్త జోనర్ లో… సినిమా చేసి అందిస్తే ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ చేస్తారు. ఈ రీతిగానే సరికొత్త జోనర్ లో సురేందర్ రెడ్డి చేసిన “ఏజెంట్” బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుందని బలంగా నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చారు.
వాస్తవానికి ఈ సినిమా స్టోరీ నాకు తెలియదు. అంతేకాదు సినిమా ఇంకా చూడలేదు. అప్పుడప్పుడు షూటింగ్ చేసి అఖిల్ ఇంటికి వచ్చి చెబుతుంటే వినేవాడిని. ఆ సమయంలో సినిమా బ్లాక్ బస్టర్ హీట్ కావటానికి ఏఏ అంశాలు ఉండాలో అవన్నీ సినిమాలో ఉన్నట్లు అర్థమయ్యాయి. మమ్ముట్టి గారు ఈ సినిమా ఒప్పుకోవటం బట్టి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అనిపిస్తోంది. సాక్షి వైవిద్య కెరియర్ కి ఈ సినిమా గొప్ప హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాట్లు తాను భావిస్తున్నట్లు నాగార్జున తెలియజేశారు. అఖిల్ ఎనర్జీని మీరు గత కొన్ని సంవత్సరాల నుండి చూస్తున్నారు.
మేము చిన్ననాటి నుంచి చూస్తూ ఉన్నాము. సరిగ్గా అఖిల్ ఎనర్జీకి సూట్ అయ్యేలా సురేందర్ రెడ్డి.. ఈ సినిమా చేయడం జరిగింది. ఇక సిక్స్ ప్యాక్ కోసం అఖిల్ పడిన కష్టాలను చూస్తూనే వచ్చాను. మా వయసులో ఇలాంటి కష్టాలు లేకపోవడం వల్ల బతికిపోయాను అనుకున్నాను. అక్కినేని అభిమానులు చూపిస్తున్న ప్రేమ వలన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని బలంగా నమ్ముతున్నట్లు నాగార్జున ఏజెంట్ ప్రీ రిలీజ్ వేడుకలో తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!