నటసింహా నందమూరి బాలకృష్ణపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలయ్యింది, మహానాయకుడు సినిమా పోయింది కాబట్టే నెటిజెన్స్ బాలయ్యని ట్రోల్ చేస్తున్నారనుకుంటే మీరు పొరపడినట్లే. సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ వెనకున్న కారణం, 118 సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య చేసిన ఒక తప్పు. జేఆర్సీ కన్వెన్షన్ లో గ్రాండ్ గా జరిగిన 118 ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎప్పట్లాగే స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకోగానే అదుపుతప్పే బాలయ్య మరోసారి కంట్రోల్ తప్పి 118 టైటిల్ నే 189గా మార్చేశాడు.
సినిమాల్లో అదిరిపోయే డైలాగులు చెప్పే బాలయ్య, స్టేజ్ పైన మాత్రం కంట్రోల్ తప్పి స్పీచ్ లు ఇస్తుంటాడు, ఈ క్రమంలోనే బాలకృష్ణ 118 టైటిల్ ని కాస్తా 189 గా మార్చి తప్పుగా మాట్లాడారు. పదే పదే అదే తీరుగా 189 అంకెనే చెప్పడంతో గ్యాలరీలో ఆడియెన్స్ చాలానే కన్ఫ్యూజ్ అయ్యారు. బాబాయ్ ని సరిచేయాలని కళ్యాణ్ రామ్ ఎంత ప్రయత్నించినా కూడా, చెవిలో చెప్పాలని ప్రయత్నించినా కూడా ఆవేశంతో మాట్లాడుతున్న బాలయ్య కళ్యాణ్ రామ్ ని పట్టించుకోలేదు. కళ్యాణ్ రామ్ ఎన్ని సైగలు చేసినా బాలకృష్ణ మాత్రం తనదైన స్టైల్ లో సినిమా టైటిల్ ని పూర్తిగా మార్చేసి 189 అంటూ క్లోజింగ్ టచ్ కూడా ఇచ్చేశాడు. ఇప్పటికైనా బాలకృష్ణ మారి మాట్లాడే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది లేదంటే భవిషత్తులో మరింత ఇబ్బంది పడే ప్రమాదం ఉంది.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!